Telugu Global
NEWS

జంపింగ్ టైం... ఫోన్‌లో అందుబాటులో లేని ఇద్ద‌రు ఎంపీలు..

తాజా ప‌రిణామాలు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేడా, ఆమంచి వైసీపీలో చేరిపోగా ఇప్పుడు ఎంపీలు కూడా వైసీపీ బాట ప‌డుతున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రు టీడీపీ ఎంపీలు ఆ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేరు. వారిద్ద‌రు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో అవంతి శ్రీనివాస్ పేరు బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఆయ‌న నేడు జ‌గ‌న్‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. మ‌రో ఎంపీ కూడా అదే దారిలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్‌, […]

జంపింగ్ టైం... ఫోన్‌లో అందుబాటులో లేని ఇద్ద‌రు ఎంపీలు..
X

తాజా ప‌రిణామాలు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేడా, ఆమంచి వైసీపీలో చేరిపోగా ఇప్పుడు ఎంపీలు కూడా వైసీపీ బాట ప‌డుతున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రు టీడీపీ ఎంపీలు ఆ పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేరు. వారిద్ద‌రు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇందులో అవంతి శ్రీనివాస్ పేరు బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఆయ‌న నేడు జ‌గ‌న్‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. మ‌రో ఎంపీ కూడా అదే దారిలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్‌, మ‌రో ఎంపీ ఇద్ద‌రూ కూడా టీడీపీ పెద్ద‌ల‌కు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రావ‌డం లేదు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేర‌బోతున్నారు. వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి రెండు మూడు రోజుల్లో వైసీపీలో చేర‌నున్నారు.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు స‌న్నిహితుడైన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ద‌మైంది. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఇంటి వ‌ద్ద టీడీపీ జెండాల‌ను తొల‌గించారు. ఈ ప‌రిణామంపై చంద్ర‌బాబు స్పందించారు.

త‌న‌ను దొంగ దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీలో ఒక కుల ఆధిపత్యంఎక్కువైంద‌ని ఆమంచి చేసిన విమ‌ర్శ‌ల‌పైనా చంద్ర‌బాబు స్పందించారు. త‌న‌కు కులం ఆపాదించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. కొంద‌రు అవ‌కాశ‌వాదులు పార్టీ వీడి వెళ్తున్నార‌ని… అలాంటి వారు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డ‌మే పార్టీకి మంచిద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

First Published:  13 Feb 2019 10:47 PM GMT
Next Story