ఆమె వ‌ల్ల‌ 130 మంది గుండు కొట్టించుకున్నారు…

మెద‌క్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎక్క‌డ చూసినా గుండ్లే క‌నిపిస్తున్నాయి. ఒకేసారి మూకుమ్మ‌డిగా గ్రామ‌స్తులు గుండ్లు కొట్టించుకోవ‌డంతో రోడ్ల‌పై బోడి గుండ్ల వారే ఎక్కువ క‌నిపిస్తున్నాయి. అల్లాదుర్గం మండ‌లం, అప్పాజిప‌ల్లిలో ఈ దృశ్యం క‌నిపిస్తోంది.

గ్రామంలో 130 మంది ఒకేసారి ఇలా గుండు కొట్టించుకున్నారు. వీరి గుండ్ల‌కు కార‌ణం స‌ర్పంచ్ ఎన్నిక‌లే. ఇటీవ‌ల స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి స్వ‌రూప విజ‌యం సాధించింది. ఆమె గెలిస్తే తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వ‌చ్చి గుండు కొట్టించుకుంటాన‌ని ఆమె భ‌ర్త మొక్కుకున్నారు. అనుకున్న‌ట్టుగానే ఆమె గెలిచింది. త‌న‌ను గెలిపించిన గ్రామ‌స్తుల‌కు భారీగా విందు ఇవ్వాల‌ని తొలుత ఆమె అనుకున్నారు. కానీ విందు కంటే గ్రామ‌స్తుల‌ను ఏ గుడికైనా తీసుకెళ్తే బాగుంటుంద‌ని భావించింది.

ఆ విష‌యం భ‌ర్త‌కు చెప్పి తిరుమ‌ల‌కు గ్రామ‌స్తుల‌ను కూడా తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. దాంతో ఆర్టీసీ బ‌స్సుల‌ను అద్దెకు తీసుకుని 130మందితో  వెళ్లారు స్వ‌రూప దంప‌తులు. కింది నుంచి కాలి న‌డ‌క‌న కొండ‌పైకి తీసుకెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత అంద‌రూ క‌లిసి గుండు కొట్టించుకున్నారు. వారితో పాటు వెళ్లిన స్వ‌రూప‌, ఇత‌ర మ‌హిళ‌లు మాత్రం పూర్తి గుండు కొట్టించుకోకుండా ఐదు క‌త్తెర‌ల వెంటు్ర‌క‌లు ఇచ్చి వ‌చ్చారు. గ్రామ‌స్తుల‌ను తిరుమ‌ల‌కు తీసుకెళ్లే ఖ‌ర్చు మొత్తం స్వ‌రూప దంప‌తులే భ‌రించారు.