Telugu Global
NEWS

రుణ‌మాఫి వాయిదా... ఈ మూడు నెల‌లు ఎలాగైనా లాగిద్దాం

ఎన్నిక‌ల్లోమ‌రోసారి గెలిచేందుకు  చంద్ర‌బాబు వ‌రుస‌గా తాయిలాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు త‌ల‌ప‌ట్టుకుంటున్నా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ప‌సుపు- కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ వంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌క‌టించారు. కేంద్రం ఇచ్చే ఆరు వేల‌కు నాలుగు వేలు క‌లిపి రైతుల‌కు డ‌బ్బులు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈనేప‌థ్యంలో ఆర్థిక శాఖ ఉన్న‌త‌స్థాయి భేటీ జ‌రిగింది. కేవ‌లం కీల‌క అధికారులు మాత్ర‌మే ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక ప‌రిస్థితి ప‌ట్ల వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ప్ర‌క‌టిస్తున్న […]

రుణ‌మాఫి వాయిదా... ఈ మూడు నెల‌లు ఎలాగైనా లాగిద్దాం
X

ఎన్నిక‌ల్లోమ‌రోసారి గెలిచేందుకు చంద్ర‌బాబు వ‌రుస‌గా తాయిలాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు త‌ల‌ప‌ట్టుకుంటున్నా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ప‌సుపు- కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ వంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌క‌టించారు. కేంద్రం ఇచ్చే ఆరు వేల‌కు నాలుగు వేలు క‌లిపి రైతుల‌కు డ‌బ్బులు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈనేప‌థ్యంలో ఆర్థిక శాఖ ఉన్న‌త‌స్థాయి భేటీ జ‌రిగింది. కేవ‌లం కీల‌క అధికారులు మాత్ర‌మే ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ఆర్థిక ప‌రిస్థితి ప‌ట్ల వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల అమ‌లు ఎంత‌కాలం సాధ్య‌మ‌న్న దానిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మూడు నెల‌ల కాలానికి ఎలాగైనా ఓట్ల‌ను రాల్చే ప‌థ‌కాల‌కు నిధులు స‌మ‌కూర్చాల్సిందేన‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఓట్ల ప‌థ‌కాల‌కు మిన‌హా మిగిలిన చెల్లింపుల‌ను నిలిపివేయాల‌ని ఆర్ధిక శాఖ నిర్ణ‌యించుకుంది. ఓట్ల ప‌థ‌కాల‌కు త‌ప్ప మిగిలిన వాటి చెల్లింపుల సంగ‌తి ఎన్నిక‌ల త‌ర్వాతే చూడాల‌ని నిర్ణ‌యించారు.

రైతు రుణ‌మాఫిని కూడా వాయిదా వేస్తున్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌నున్నారు. రైతు రుణ‌మాఫికి సంబంధించి పోస్టు డేటెడ్ చెక్‌లు రైతుల చేతిలో పెట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతానికి అన్న‌దాత సుఖీభ‌వ కింద విడ‌త‌ల వారీగా ఇచ్చే సొమ్ముతో స‌ర్దుకుపోయేలా చూడాల‌ని నిర్ణ‌యించారు. ఒక‌వేళ తిరిగి అధికారంలోకి వ‌స్తే ఈ ప‌థ‌కాలను అమ‌లు చేయ‌డం ఎలా అన్న దానిపై మాత్రం ప్ర‌స్తుతానికి ఆలోచించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో గెలిచి త‌ర్వాత అప్ప‌టి ప‌రిస్థితులు వేరు అన్న‌ట్టు ప్ర‌భుత్వ పెద్ద‌ల వైఖ‌రి ఉంది.

First Published:  14 Feb 2019 9:26 PM GMT
Next Story