Telugu Global
NEWS

అవంతిని బెదిరించారు...నాపై కుట్ర‌లు చేస్తున్నారు- బాబు ఆందోళ‌న‌

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేర‌డంపై సీఎం చంద్ర‌బాబునాయుడు స్పందించారు. అవంతి శ్రీనివాస్ ఆస్తులు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని… ఆ విష‌యంలో బెదిరించి వైసీపీలో చేర్చుకున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు స్థానిక నేత‌ల‌కు తెలుస్తుంటాయ‌ని అక్క‌డ ఏం జ‌రుగుతోందో త‌న‌కు వెంట‌నే తెలియ‌జేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. మొన్న ఢిల్లీలో త‌న‌తో పాటు తిరిగిన అవంతి శ్రీనివాస్ ఆ మ‌రుస‌టి రోజే వైసీపీలో చేరిపోయారంటే ఏమ‌నుకోవాల‌ని ప్ర‌శ్నించారు.  ఏ కులం వారు విమ‌ర్శలు చేస్తే ఆ కులం […]

అవంతిని బెదిరించారు...నాపై కుట్ర‌లు చేస్తున్నారు- బాబు ఆందోళ‌న‌
X

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేర‌డంపై సీఎం చంద్ర‌బాబునాయుడు స్పందించారు. అవంతి శ్రీనివాస్ ఆస్తులు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని… ఆ విష‌యంలో బెదిరించి వైసీపీలో చేర్చుకున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు స్థానిక నేత‌ల‌కు తెలుస్తుంటాయ‌ని అక్క‌డ ఏం జ‌రుగుతోందో త‌న‌కు వెంట‌నే తెలియ‌జేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

మొన్న ఢిల్లీలో త‌న‌తో పాటు తిరిగిన అవంతి శ్రీనివాస్ ఆ మ‌రుస‌టి రోజే వైసీపీలో చేరిపోయారంటే ఏమ‌నుకోవాల‌ని ప్ర‌శ్నించారు. ఏ కులం వారు విమ‌ర్శలు చేస్తే ఆ కులం నాయ‌కులే వాటిని తిప్పికొట్టాల‌ని సూచించారు.

త‌మ కుటుంబంలోనూ పురందేశ్వ‌రి బీజేపీలో, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీలో ఉన్నార‌ని… రాజ‌కీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అమ‌రావ‌తిలో రోజూ త‌ర‌హాలోనే నేత‌ల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు… తాను కేంద్రంతో యుద్దం చేస్తున్నాన‌ని చెప్పారు. అందుకే త‌న‌పై కుట్ర‌ల‌కు ప‌దును పెడుతున్నార‌ని నేత‌ల వ‌ద్ద చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్‌, మోడీ, కేసీఆర్ ముగ్గురు ఒక‌టే అని ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకెళ్లాల‌ని సూచించారు.

విప‌త్తుల‌ను ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు సొంతంగా ఉందంటూ ఆ మ‌ధ్య కేర‌ళ వ‌ర‌ద స‌మ‌యంలో అరబ్ దేశాల సాయాన్ని భార‌త్ తిర‌స్క‌రించ‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. కేంద్రం ఇవ్వ‌దు.. ఎవ‌రైనా సాయం చేసేందుకు వ‌స్తే చేయ‌నివ్వ‌దు అంటూ విమ‌ర్శించారు. ఆంధ‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చిన విప‌త్తుకు సంబంధించిన ప‌రిహారాన్ని ఇప్ప‌టికీ కేంద్రం విడుద‌ల చేయ‌లేద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

First Published:  14 Feb 2019 11:40 PM GMT
Next Story