సాయంత్రం జ‌గ‌న్ వ‌ద్ద‌కు జైర‌మేష్

వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ఉన్న వారు కూడా చంద్ర‌బాబును వ‌దిలేస్తున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ దాస‌రి జై ర‌మేష్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు.

ఆయ‌న వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. సాయంత్రం హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో జ‌గ‌న్‌తో దాస‌రి జైర‌మేష్ భేటీ కానున్నారు. దాస‌రి జైర‌మేష్.. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా స‌న్నిహితుడు.

ఆయ‌నే ఇప్పుడు టీడీపీ వీడేందుకు సిద్ద‌మ‌వ‌డంతో టీడీపీ సీనియ‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. వైసీపీలో చేరి విజ‌య‌వాడ నుంచి దాస‌రి జైర‌మేష్ ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంది. దాస‌రి జైర‌మేష్‌.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు అత్యంత స‌న్నిహితుడు.