Telugu Global
NEWS

ఎస్పీలుగా బాబు సొంత మ‌నుషులు

ఎన్నిక‌ల షెడ్యూల్ త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉండ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయ బ‌దిలీల‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పోలీస్ శాఖ‌లో కావాల్సిన వ్య‌క్తుల‌ను కావాల్సిన స్థానాల్లో నియమిస్తున్నారు. ముక్కుసూటిగా, నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌ను లూప్‌లోకి పంపి… త‌న‌కు అవ‌స‌ర‌మైన వారికి కీల‌క పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే 35 మంది సీఐల‌కు డీఎస్పీలుగా ప్ర‌మోషన్ ఇస్తే అందులో 34 మంది చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం వారే కావ‌డంతో పోలీస్ శాఖ‌లో క‌ల‌క‌లం రేగింది. ఇప్పుడు ఎస్పీల విష‌యంలోనూ చంద్ర‌బాబు అదే […]

ఎస్పీలుగా బాబు సొంత మ‌నుషులు
X

ఎన్నిక‌ల షెడ్యూల్ త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉండ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయ బ‌దిలీల‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పోలీస్ శాఖ‌లో కావాల్సిన వ్య‌క్తుల‌ను కావాల్సిన స్థానాల్లో నియమిస్తున్నారు. ముక్కుసూటిగా, నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌ను లూప్‌లోకి పంపి… త‌న‌కు అవ‌స‌ర‌మైన వారికి కీల‌క పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

ఇప్ప‌టికే 35 మంది సీఐల‌కు డీఎస్పీలుగా ప్ర‌మోషన్ ఇస్తే అందులో 34 మంది చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం వారే కావ‌డంతో పోలీస్ శాఖ‌లో క‌ల‌క‌లం రేగింది. ఇప్పుడు ఎస్పీల విష‌యంలోనూ చంద్ర‌బాబు అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా ప్ర‌కాశం జిల్లా ఎస్పీగా ఉన్న స‌త్య ఏసుదాసును బ‌దిలీ చేశారు. ఆయ‌న స్థానంలో చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన కోయ ప్ర‌వీణ్‌ను ప్ర‌కాశం జిల్లా ఎస్పీగా తీసుకొచ్చారు. ఏసుబాబు ఉంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇబ్బందులు వ‌స్తాయ‌న్న ఉద్దేశంతోనే ఈ బ‌దిలీ చేశార‌ని చెబుతున్నారు.

స‌త్యఏసుదాసుపై చాలాకాలంగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన చంద్ర‌బాబు సామాజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌ను ఉంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చంద్ర‌బాబు వ‌ద్ద మొర‌పెట్టుకున్నారు. దీంతో ఆయ‌న్ను బ‌దిలీ చేశారు.కోయ ప్ర‌వీణ్ టీడీపీ ఎంపీ గ‌రిక‌పాటి రామ్మోహ‌న్‌రావుకు స‌మీప బంధువు.

అదే త‌ర‌హాలోనే క‌డ‌ప ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతిని బ‌దిలీ చేశారు. ఎంపీగా పోటీ చేసేందుకు అంగీక‌రించిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి… ముందుగా ఎస్పీని బ‌దిలీ చేయాల‌ని చంద్ర‌బాబును కోరారు. ఇందుకు స‌మ్మ‌తించిన చంద్ర‌బాబు… అభిషేక్ మ‌హంతిపై వేటు వేశారు. ఆయ‌న స్థానంలో రాహుల్ దేవ్ శ‌ర్మ‌ను తీసుకొచ్చారు. అభిషేక్ మ‌హంతిని గ్రేహౌండ్స్‌కు బ‌దిలీ చేశారు. త్వ‌ర‌లో మ‌రికొంత మంది ఉన్న‌తాధికారుల‌ను కూడా ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బ‌దిలీ చేయనున్నారు.

First Published:  14 Feb 2019 8:33 PM GMT
Next Story