నేను పోటీ చేయ‌డం లేదు… అమ్మ‌, నాన్నే పోటీ చేస్తారు….

టీడీపీలో చేరిక‌పై కోట్ల కుటుంబం క్లారిటీ ఇచ్చింది. త్వ‌ర‌లోనే తాము టీడీపీలో చేర‌బోతున్న‌ట్టు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్రారెడ్డి వెల్ల‌డించారు. టీడీపీ నుంచే తమ కుటుంబం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని చెప్పారు. అయితే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌న్నారు.

త‌న తండ్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌న త‌ల్లి కోట్ల సుజాత‌మ్మ‌లు ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌ని చెప్పారు. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి సోద‌రుడు కోట్ల హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి వైసీపీ వైపు నిల‌వ‌డంపైనా రాఘవేంద్రారెడ్డి స్పందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో రాజకీయ విబేధాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌న్నారు. వ్య‌క్తిగ‌త ఇబ్బందులు ఏమీ లేవ‌న్నారు.

వ‌చ్చే ఎన్నికల్లో త‌న వార‌సుడిగా కోట్ల రాఘ‌వేంద్రారెడ్డిని సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి బ‌రిలో దింపుతార‌ని భావించారు. అయితే రాజ‌కీయ ప‌రిస్థితులు సంక్లిష్టంగా ఉన్న నేప‌థ్యంలో కుమారుడి రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై ప్ర‌యోగం స‌రికాద‌న్న ఉద్దేశంతోనే ఈసారి ఎన్నిక‌ల్లో కుమారుడిని దూరంగా ఉంచుతున్న‌ట్టు భావిస్తున్నారు.