Telugu Global
NEWS

మాగుంట భేటీలో ఏం జ‌రిగిందంటే...

ఎన్నిక‌ల వేళ టీడీపీకి వ‌రుస షాక్‌లు త‌ప్పేలా లేవు. తాజాగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస‌రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. నిన్న ఆయ‌న నెల్లూరులో ముఖ్య అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌న్న దానిపై అనుచ‌రుల‌తో చ‌ర్చించారు. వైసీపీ నుంచి త‌న‌కు ఆహ్వానం అందిన మాట వాస్త‌వ‌మేన‌ని అనుచ‌రులకు వివ‌రించారు. చంద్ర‌బాబు కూడా ఒంగోలు, లేదా నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అనుచ‌రుల‌కు వివ‌రించారు. ఇటీవ‌ల కొన్ని […]

మాగుంట భేటీలో ఏం జ‌రిగిందంటే...
X

ఎన్నిక‌ల వేళ టీడీపీకి వ‌రుస షాక్‌లు త‌ప్పేలా లేవు. తాజాగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస‌రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. నిన్న ఆయ‌న నెల్లూరులో ముఖ్య అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌న్న దానిపై అనుచ‌రుల‌తో చ‌ర్చించారు.

వైసీపీ నుంచి త‌న‌కు ఆహ్వానం అందిన మాట వాస్త‌వ‌మేన‌ని అనుచ‌రులకు వివ‌రించారు. చంద్ర‌బాబు కూడా ఒంగోలు, లేదా నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అనుచ‌రుల‌కు వివ‌రించారు. ఇటీవ‌ల కొన్ని బృందాల‌ను శ్రీనివాస‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

అలా వెళ్లిన బృందాలు కూడా స‌మావేశంలో పాల్గొన్నాయి. చాలా మంది అనుచ‌రులు వైసీపీలోకి వెళ్లాల్సిందిగా సూచించారు. వైసీపీ నుంచి ఒంగోలు కానీ, నెల్లూరు కానీ ఎంపీ టికెట్ తెచ్చుకుంటే ఈజీగా గెలుస్తార‌ని అనుచ‌రులు ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ త‌ర‌పున అయితే చెప్ప‌లేమ‌ని.. చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుందని మాగుంట ఎదుటే త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు.

అనుచ‌రుల అభిప్రాయాల‌ను తెలుసుకున్న మాగుంట ఈనెల 17 త‌ర్వాత ఒక నిర్ణ‌యం తీసుకుందామ‌ని స్ప‌ష్టం చేశారు. మాగుంట త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం అవ‌డం, ఆయ‌న వైసీపీలో చేరేందుకు రంగం సిద్ద‌మైంద‌న్న విష‌యం తెలుసుకున్న సీఎంవో అధికారులు వెంట‌నే మాగుంట శ్రీనివాస‌రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు.

ఈ స‌మావేశానికి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని… ఒక కార్య‌క్ర‌మంలో భాగంగా నెల్లూరు వ‌చ్చాన‌ని దాంతో అనుచ‌రుల‌తో స‌మావేశం అయ్యాన‌ని వివ‌రించారు. శుక్ర‌వారం సీఎంను క‌ల‌వాల్సిందిగా సీఎంవో కోర‌గా త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మాగుంట చెప్పారు. అయితే మాగుంట వైసీపీలో చేరే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

First Published:  14 Feb 2019 9:02 PM GMT
Next Story