Telugu Global
National

పాక్‌కు భార‌త్ షాక్... ఎంఎఫ్ఎన్ హోదా ర‌ద్దు

భార‌త్‌లో ఉగ్ర‌దాడుల‌కు సాయ‌ప‌డుతున్న పాకిస్థాన్ విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మోస్ట్ ఫేవ‌ర్డ్‌ నేష‌న్ జాబితా నుంచి పాకిస్థాన్ పేరును భార‌త్ తొల‌గించింది. అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ పేరును తొల‌గిస్తున్నట్టు భార‌త్ ప్ర‌క‌టించింది. ఒక దేశంతో ఉన్న వ్యాపార సంబంధాల ఆధారంగా మ‌రో దేశం మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ హోదాను జారీ చేస్తుంది. దేశంలో ఉగ్ర‌దాడుల‌ను పాక్ ప్రోత్స‌హిస్తున్న నేప‌థ్యంలో ఎంఎఫ్ఎన్ స్టేట‌స్‌ను భార‌త్ ర‌ద్దు చేసింది. పాకిస్థాన్‌ను అంత‌ర్జాతీయంగా […]

పాక్‌కు భార‌త్ షాక్... ఎంఎఫ్ఎన్ హోదా ర‌ద్దు
X

భార‌త్‌లో ఉగ్ర‌దాడుల‌కు సాయ‌ప‌డుతున్న పాకిస్థాన్ విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మోస్ట్ ఫేవ‌ర్డ్‌ నేష‌న్ జాబితా నుంచి పాకిస్థాన్ పేరును భార‌త్ తొల‌గించింది.

అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ పేరును తొల‌గిస్తున్నట్టు భార‌త్ ప్ర‌క‌టించింది. ఒక దేశంతో ఉన్న వ్యాపార సంబంధాల ఆధారంగా మ‌రో దేశం మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ హోదాను జారీ చేస్తుంది. దేశంలో ఉగ్ర‌దాడుల‌ను పాక్ ప్రోత్స‌హిస్తున్న నేప‌థ్యంలో ఎంఎఫ్ఎన్ స్టేట‌స్‌ను భార‌త్ ర‌ద్దు చేసింది.

పాకిస్థాన్‌ను అంత‌ర్జాతీయంగా ఒంట‌రి చేయ‌బోతున్నామ‌ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పుల్వామా ఘ‌ట‌న‌పై రేపు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు. దాడికి సంబంధించిన వివ‌రాల‌ను అన్ని పార్టీల‌కు రాజ్‌నాథ్ సింగ్ వివ‌రిస్తార‌ని జైట్లీ చెప్పారు.

పాకిస్థాన్‌ను అంత‌ర్జాతీయ స‌మాజంలో ఒంట‌రిని చేసేందుకు విదేశాంగ శాఖ ద్వారా అన్ని ప్ర‌యత్నాలు చేస్తామ‌న్నారు. దేశంలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేందుకు సాయ‌ప‌డుతున్న వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. దేశ ద్రోహుల‌కు సాయం చేసిన వారు ఫ‌లితాన్ని అనుభ‌వించి తీరుతార‌ని హెచ్చ‌రించారు.

First Published:  15 Feb 2019 12:42 AM GMT
Next Story