స‌త్తెన‌ప‌ల్లిలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో మ‌రోసారి ఉది్ర‌క్త‌త త‌లెత్తింది. నియోజ‌క‌వ‌ర్గంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబం అరాచ‌కం సాగిస్తోందంటూ అఖిల‌ప‌క్ష నేత‌లు ధ‌ర్నాకు సిద్ధ‌మ‌య్యారు. తాలూకా సెంట‌ర్‌లో ధ‌ర్నా చేసేందుకు వైసీపీ, వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, బీజేపీలు సిద్ధ‌మ‌య్యాయి.

ధ‌ర్నా చేయ‌డానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమ‌తి తీసుకున్నామ‌ని చెప్పినా పోలీసులు విన‌లేదు. టెంట్ల‌ను కూల్చివేశారు. మైకుల‌ను తొల‌గించారు. వంద‌ల మంది పోలీసుల‌ను తాలూకా సెంట‌ర్‌లో మోహ‌రించారు.

స్పీక‌ర్ కోడెల కుటుంబం నియోజ‌వ‌క‌ర్గంలో సాగిస్తున్న అవినీతి, అరాచ‌కానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు కూడా లేదా అఖిల‌ప‌క్షం నేత‌లు ప్ర‌శ్నించారు. నియోజ‌క‌వ‌ర్గంలో సామాన్యుడు ఇల్లు క‌ట్టుకోవాల‌న్నా కోడెల కుటుంబానికి మామూళ్లు చెల్లించాల్సిన దుస్థితి ఇక్క‌డ ఉంద‌ని నేత‌లు విమ‌ర్శించారు. తోపుడు బండ్ల‌పై వ్యాపారం చేసుకునే వారు కూడా కోడెల కుటుంబానికి లంచం ఇచ్చుకోవాల్సి వ‌స్తోంద‌న్నారు.

ఇసుక తీసుకెళ్లాల‌న్న కోడెల కుమారుడికి ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తోంద‌న్నారు. ప్ర‌తి ప‌నిలోనూ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు, కుమార్తె దోచుకుంటున్నార‌ని ఆరోపించారు.  రైల్వే లైన్లు వేసే కాంటా్ర‌క్టుల‌ను కూడా క‌మిష‌న్ల కోసం కిడ్నాప్ చేసిన చ‌రిత్ర ఉంద‌న్నారు.

చివ‌ర‌కు అన్న క్యాంటీన్ల‌లో భోజ‌నాన్ని కూడా ఎత్తుకెళ్లి సొంత కంపెనీలో కార్మికుల‌కు కోడెల కుమార్తె అమ్ముకుంటున్నార‌ని… ఇంత‌కంటే అరాచ‌కం ఎక్క‌డా ఉండ‌ద‌ని అఖిల‌ప‌క్ష నేత‌లు విమ‌ర్శించారు.