Telugu Global
National

సుప్రీం కోర్టు తీర్పునే మార్చిన అంబాని శ‌క్తులు

సుప్రీం కోర్టులో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఆడిస్తున్న కార్పొరేట్ శ‌క్తులు సుప్రీం కోర్టులోకి చొర‌బ‌డ్డాయి. ఏకంగా న్యాయ‌మూర్తులు ఇచ్చిన తీర్పుల‌నే తారుమారు చేసింది కార్పొరేట్ శ‌క్తి. న్యాయ‌మూర్తులు ఒక తీర్పు ఇవ్వ‌గా… సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో మాత్రం మ‌రోలా తీర్పును అప్‌లోడ్ చేశారు. ఈ వ్య‌వ‌హారం అనిల్ అంబానీ కేసులో జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ సంస్థ త‌మ‌తో ప‌నిచేయించుకుని అందుకు సంబంధించిన బ‌కాయిలు మాత్రం […]

సుప్రీం కోర్టు తీర్పునే మార్చిన అంబాని శ‌క్తులు
X

సుప్రీం కోర్టులో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఆడిస్తున్న కార్పొరేట్ శ‌క్తులు సుప్రీం కోర్టులోకి చొర‌బ‌డ్డాయి. ఏకంగా న్యాయ‌మూర్తులు ఇచ్చిన తీర్పుల‌నే తారుమారు చేసింది కార్పొరేట్ శ‌క్తి. న్యాయ‌మూర్తులు ఒక తీర్పు ఇవ్వ‌గా… సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో మాత్రం మ‌రోలా తీర్పును అప్‌లోడ్ చేశారు. ఈ వ్య‌వ‌హారం అనిల్ అంబానీ కేసులో జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అనిల్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ సంస్థ త‌మ‌తో ప‌నిచేయించుకుని అందుకు సంబంధించిన బ‌కాయిలు మాత్రం చెల్లించ‌డం లేద‌ని ఎరిక్స‌న్ ఇండియా సంస్థ సుప్రీం కోర్టును గ‌తంలో ఆశ్ర‌యించింది. పిటిష‌న్‌ను విచారించిన కోర్టు డ‌బ్బు చెల్లించాల్సిందిగా అనిల్‌ను ఆదేశించింది. అందుకు స‌మ్మ‌తించిన అనిల్ ఆ త‌ర్వాత సుప్రీం కోర్టు తీర్పును లెక్క‌చేయ‌లేదు. దీంతో కోర్టు ధిక్క‌ర‌ణ కింద స్వ‌యంగా కోర్టు ముందు హాజ‌రుకావాల‌ని అనిల్ అంబానీ, కంపెనీ ప్ర‌తినిధుల‌ను ఆదేశిస్తూ జ‌స్టిస్ రొహింట‌న్ ఎఫ్ నారిమ‌న్ ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

ఇక్క‌డే సుప్రీం కోర్టులోని అంబానీ మ‌నుషులు ప‌నిచేశారు. స్వ‌యంగా అనిల్ అంబానీ కోర్టు ముందు హాజ‌రుకావాల్సిందిగా న్యాయ‌మూర్తులు ఆదేశించ‌గా… సుప్రీం వైబ్‌సైట్‌లో మాత్రం అనిల్ స్వ‌యంగా కోర్టుకు హాజ‌రుకావాల్సిన అవ‌స‌రం లేద‌ని న్యాయ‌మూర్తులు తీర్పు చెప్పిన‌ట్టు ఉంది. ఈ విష‌యాన్ని బాధిత సంస్థ న్యాయ‌మూర్తి దృష్టికి తీసుకెళ్లింది.

దీంతో షాక్ అయిన న్యాయ‌మూర్తులు ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేశారు. వెంట‌నే లోతుగా విచార‌ణ జ‌రిపించిన సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్… కావాల‌నే ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు తీర్పును అంబానీల‌కు అనుకూలంగా మార్చి వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్టు నిర్ధారించారు. ఇంత‌గా తెగించిన అసిస్టెంట్ రిజిస్రా్ట‌ర్లు మాన‌వ్ శ‌ర్మ‌, త‌ప‌న్ కుమార్ చ‌క్ర‌వ‌ర్తుల‌ను … త‌న విశిష్ట అధికారాల‌ను ఉప‌యోగించి ఉద్యోగాల నుంచి చీఫ్ జ‌స్టిస్ తొల‌గించారు. ఈ ఇద్ద‌రు అధికారులు ఇలా చేసేలా అంబానీలు ప్ర‌లోభ‌పెట్టి ఉంటార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

First Published:  14 Feb 2019 10:07 PM GMT
Next Story