Telugu Global
NEWS

సిద్దిపేటలో చీర‌ల ఆఫ‌ర్‌...20 మంది మ‌హిళ‌ల‌కు గాయాలు...

సిద్దిపేటలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఒక షాపింగ్ మాల్ వ‌ద్ద‌కు భారీగా మ‌హిళ‌లు రావ‌డంతో ఈ తొక్కిస‌లాట జ‌రిగింది. తొక్కిస‌లాట‌లో 20 మంది మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ తొక్కిస‌లాట‌కు స‌ద‌రు షాపింగ్ మాల్ పెట్టిన ఆఫ‌రే కార‌ణం. పది రూపాయ‌ల‌కే చీర అంటూ షాపింగ్ మాల్ ఆఫ‌ర్ పెట్ట‌డంతో మ‌హిళ‌లు ఒక్క‌సారిగా భారీగా అక్క‌డికి చేరుకున్నారు. ఆల‌స్యం అయితే చీర‌లు దొర‌క‌వ‌న్న ఉద్దేశంతో తోసుకున్నారు. అది కాస్త తొక్కిస‌లాట‌కు దారి తీసింది. చాలా మంది […]

సిద్దిపేటలో చీర‌ల ఆఫ‌ర్‌...20 మంది మ‌హిళ‌ల‌కు గాయాలు...
X

సిద్దిపేటలో తొక్కిస‌లాట జ‌రిగింది. ఒక షాపింగ్ మాల్ వ‌ద్ద‌కు భారీగా మ‌హిళ‌లు రావ‌డంతో ఈ తొక్కిస‌లాట జ‌రిగింది. తొక్కిస‌లాట‌లో 20 మంది మ‌హిళ‌లు గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ తొక్కిస‌లాట‌కు స‌ద‌రు షాపింగ్ మాల్ పెట్టిన ఆఫ‌రే కార‌ణం.

పది రూపాయ‌ల‌కే చీర అంటూ షాపింగ్ మాల్ ఆఫ‌ర్ పెట్ట‌డంతో మ‌హిళ‌లు ఒక్క‌సారిగా భారీగా అక్క‌డికి చేరుకున్నారు. ఆల‌స్యం అయితే చీర‌లు దొర‌క‌వ‌న్న ఉద్దేశంతో తోసుకున్నారు. అది కాస్త తొక్కిస‌లాట‌కు దారి తీసింది. చాలా మంది మ‌హిళ‌లు కింద‌ప‌డిపోయారు.

తొక్కిస‌లాట మొద‌ల‌వ‌డంతో చీర‌ల సంగ‌తేమో గానీ… చాలా మంది మ‌హిళ‌లు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఆఫ‌ర్ పెట్టిన షాపింగ్ మాల్ వారు ఆ త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌డంలో విఫ‌లం అవ‌డం వ‌ల్లే ఈ తొక్కిస‌లాట జ‌రిగింద‌ని భావిస్తున్నారు.

First Published:  16 Feb 2019 2:42 AM GMT
Next Story