వైసీపీలోకి రాంపుల్లారెడ్డి…

వైసీపీలోకి టీడీపీ నేత‌ల వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌గా ఉన్న ఇరిగెల‌ రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు.

ఆయ‌న వైసీపీలో చేరుతున్నారు. నేడు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండుకా క‌ప్పుకోనున్నారు. రాంపుల్లారెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు కూడా వైసీపీలో చేరుతున్నారు.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో భూమా వ‌ర్గానికి వ్య‌తిరేకులుగా రాంపుల్లారెడ్డి కుటుంబానికి పేరుంది. అఖిల ప్రియ విధానాల ప‌ట్ల విసిగిపోయి ఆయ‌న పార్టీ వీడుతున్న‌ట్టు చెబుతున్నారు.