Telugu Global
National

సిద్దును నిషేధించాల‌ని నెటిజ‌న్ల ఉద్య‌మం

ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్‌ను ప‌రోక్షంగా వెనుకేసుకొస్తూ మాజీ క్రికెటర్ , కాంగ్రెస్ నేత సిద్ధు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. నెటిజ‌న్లు ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఉగ్ర‌దాడికి ఒక దేశాన్ని మొత్తం నిందిస్తారా… పాక్‌తో భార‌త్ చ‌ర్చ‌లు జ‌రిపితేనే ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం కాకుండా ఉంటాయంటూ సిద్ధు చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సిద్ధును కాంగ్రెస్ నుంచి గెంటివేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సోనీ టివీకి కూడా ఇదే త‌ర‌హా డిమాండ్ […]

సిద్దును నిషేధించాల‌ని నెటిజ‌న్ల ఉద్య‌మం
X

ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్‌ను ప‌రోక్షంగా వెనుకేసుకొస్తూ మాజీ క్రికెటర్ , కాంగ్రెస్ నేత సిద్ధు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. నెటిజ‌న్లు ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఉగ్ర‌దాడికి ఒక దేశాన్ని మొత్తం నిందిస్తారా… పాక్‌తో భార‌త్ చ‌ర్చ‌లు జ‌రిపితేనే ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం కాకుండా ఉంటాయంటూ సిద్ధు చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సిద్ధును కాంగ్రెస్ నుంచి గెంటివేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సోనీ టివీకి కూడా ఇదే త‌ర‌హా డిమాండ్ పెడుతున్నారు జ‌నం. సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్‌ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఆ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు. లేకుంటే తాము సోనీ టీవీని బ‌హిష్క‌రిస్తామ‌ని ప‌లువురు నెటిజ‌న్లు హెచ్చ‌రిస్తున్నారు.

భార‌త్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు వంత‌పాడుతున్న సిద్ధుకు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తాల్సిందిగా తోటి నెటిజ‌న్ల‌కు పిలుపునిస్తున్నారు. కొద్ది నెల‌ల క్రితం పాక్ ప్ర‌ధానిగా ఇమా్ర‌న్ ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైన సిద్ధు… అక్క‌డే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగ‌నం చేసుకోవ‌డంపైనా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా స‌రే కాంగ్రెస్ నేత‌గా ఉన్న సిద్ధు మాత్రం పాకిస్థాన్ ప‌ట్ల త‌న అభిమానాన్ని చంపుకోలేక‌పోతున్నారు.

First Published:  15 Feb 2019 11:37 PM GMT
Next Story