Telugu Global
National

న‌ల్ల రంగు పూసి గాడిద మీద ఊరేగించండి... కంగ‌నా ఫైర్

పుల్వామాలో ఉగ్ర‌దాడిపై న‌టి కంగ‌నా ర‌నౌత్ తీవ్ర ఆవేద‌న చెందారు. భార‌త్ స‌హ‌నాన్ని పాకిస్థాన్ చేత‌గానిత‌నంగా భావిస్తోంద‌ని… వారికి బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఎవ‌రైనా శాంతి, అహింస అంటూ క‌బుర్లు చెబితే అలాంటి వారి ముఖాల‌కు న‌ల్ల‌రంగు పూసి గాడిద‌ల మీద ఊరేగించాల‌ని వ్యాఖ్యానించారు. పాక్ మ‌న దేశ భ‌ద్ర‌త‌ను స‌వాల్ చేయ‌డ‌మే కాకుండా దేశ మ‌ర్యాద‌ను కూడా హేళ‌న చేసింద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకు త‌గిన స‌మాధానం చెప్పాల్సిందేన‌న్నారు. […]

న‌ల్ల రంగు పూసి గాడిద మీద ఊరేగించండి... కంగ‌నా ఫైర్
X

పుల్వామాలో ఉగ్ర‌దాడిపై న‌టి కంగ‌నా ర‌నౌత్ తీవ్ర ఆవేద‌న చెందారు. భార‌త్ స‌హ‌నాన్ని పాకిస్థాన్ చేత‌గానిత‌నంగా భావిస్తోంద‌ని… వారికి బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఎవ‌రైనా శాంతి, అహింస అంటూ క‌బుర్లు చెబితే అలాంటి వారి ముఖాల‌కు న‌ల్ల‌రంగు పూసి గాడిద‌ల మీద ఊరేగించాల‌ని వ్యాఖ్యానించారు.

పాక్ మ‌న దేశ భ‌ద్ర‌త‌ను స‌వాల్ చేయ‌డ‌మే కాకుండా దేశ మ‌ర్యాద‌ను కూడా హేళ‌న చేసింద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకు త‌గిన స‌మాధానం చెప్పాల్సిందేన‌న్నారు. మ‌న స‌హ‌నాన్ని పాక్ చేత‌గాని త‌నంగా భావించ‌డం వ‌ల్లే దేశం నెత్తురోడుతోంద‌ని ఆవేద‌న చెందారు.

మ‌న బిడ్డ‌ల‌ను చంపి పాకిస్థాన్ స‌వాల్ చేస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు కూడా ఎవ‌రైనా శాంతి, అహింస అంటే న‌ల్ల‌రంగు పూసి గాడిద‌ల మీద ఊరేగించాల్సిందేన‌న్నారు. ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో మ‌ణిక‌ర్ణిక స‌క్సెస్ మీట్‌ను వాయిదా వేసిన‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు.

First Published:  15 Feb 2019 10:56 PM GMT
Next Story