వీడు క‌నిపిస్తే చెప్పండి…

పుల్వామాలో ఉగ్ర‌దాడిపై దేశం మొత్తం ర‌గిలిపోతుంటే ఇక్క‌డే ఉంటూ, దేశం పెట్టే తిండి తింటూనే ఉగ్ర‌వాదుల‌కు జై కొట్టే దేశ ద్రోహులూ తిరుగుతున్నారు. బెంగ‌ళూరులోని ఒక ప్ర‌ముఖ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక వ్య‌క్తి కూడా అలాంటి జాబితాలో చేరిపోయాడు.

ఉగ్ర‌దాడిలో భారీగా జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆవేద‌న చెంద‌క‌పోగా …దాడి చేసిన ఉగ్ర‌వాదికి వంత‌పాడారు.అసలైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటే ఇదీ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అత‌డి పేరు అబిద్ మాలిక్. క‌శ్మీర్‌కు చెందిన ఇత‌డు బెంగ‌ళూరులో ప‌నిచేస్తున్నాడు.

ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే సోష‌ల్ మీడియాలో స్పందిందిన అబిద్‌…  చ‌నిపోయ‌న ఉగ్ర‌వాదిని ఉద్దేశించి రిప్ బ్రో అంటూ సానుభూతి తెలిపాడు.

అంత‌టితో ఆగ‌కుండా క‌శ్మీర్ సమ‌స్య‌పై ఇప్ప‌టికైనా స్పందించ‌క‌పోతే మ‌రో 40 మంది సైనికులు చ‌చ్చిపోతార‌ని నోరుపారేసుకున్నాడు. ఈ పోస్టుపై నెటిజ‌న్లు విరుచుకుప‌డ్డారు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. దాంతో పోస్టును డిలేట్ చేసి అబిద్ పారిపోయాడు.

అత‌డిని ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది. పోలీసులు అబిద్ మాలిక్ కోసం గాలిస్తున్నారు. అత‌డి ఆచూకీ తెలిస్తే తెలియ‌జేయాల్సిందిగా పోలీసులు కోరారు.