Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ కోసం వెతికే హీరో

నందమూరి హీరో కల్యాణ్ రామ్ మరో మూవీ రెడీ చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కేవీ గుహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 118 అనే సినిమా చేశాడు. ఈ మూవీ ట్రయిలర్ మార్కెట్లోకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. స్టయిలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 సినిమాలో షాలినీ పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో కల్యాణ్ రామ్ కు గర్ల్ ఫ్రెండ్ గా […]

హీరోయిన్ కోసం వెతికే హీరో
X

నందమూరి హీరో కల్యాణ్ రామ్ మరో మూవీ రెడీ చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కేవీ గుహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 118 అనే సినిమా చేశాడు. ఈ మూవీ ట్రయిలర్ మార్కెట్లోకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది.

స్టయిలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 సినిమాలో షాలినీ పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో కల్యాణ్ రామ్ కు గర్ల్ ఫ్రెండ్ గా షాలినీ నటిస్తే, కీలకమైన పాత్రలో నివేత కనిపించనుంది. నివేతను వెదుక్కుంటూ వెళ్లే క్రమంలో ఓ మర్డరీ మిస్టరీని చేధిస్తాడు హీరో. ఆ కథకు 118కు ఏంటి సంబంధం అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఈ సినిమా తనకు ఓ మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందంటున్నాడు హీరో కల్యాణ్ రామ్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, మార్చి 1న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటున్నాడు.

First Published:  16 Feb 2019 9:57 PM GMT
Next Story