Telugu Global
National

పాక్ వ‌స్తువుల‌పై ప‌న్నుమోత‌...

ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాకిస్థాన్ విష‌యంలో భార‌త్ మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ జాబితా నుంచి పాక్‌ను భార‌త్ తొల‌గించింది. తాజాగా పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే వ‌స్తువుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీనీ ఏకంగా 200 శాతానికి పెంచింది. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల పాక్ నుంచి దిగుమతుల‌కు చెక్ ప‌డే అవ‌కాశం ఉంది. 2017-18లో పాక్ నుంచి భార‌త్‌కు రూ. […]

పాక్ వ‌స్తువుల‌పై ప‌న్నుమోత‌...
X

ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాకిస్థాన్ విష‌యంలో భార‌త్ మ‌రిన్ని క‌ఠిన
చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ జాబితా నుంచి
పాక్‌ను భార‌త్ తొల‌గించింది. తాజాగా పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే
వ‌స్తువుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీనీ ఏకంగా 200 శాతానికి పెంచింది. ఈ
నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ
ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల పాక్ నుంచి దిగుమతుల‌కు చెక్ ప‌డే అవ‌కాశం ఉంది.
2017-18లో పాక్ నుంచి భార‌త్‌కు రూ. 3,482 కోట్ల విలువైన దిగుమ‌తులు
జ‌రిగాయి. పాక్ నుంచి ఎక్కువ‌గా పండ్లు, సిమెంట్, ముడి ఖ‌నిజాలు దిగుమ‌తి
అవుతున్నాయి. ఇప్పుడు ప‌న్నును 200శాతానికి పెంచ‌డం వ‌ల్ల పాక్ నుంచి
దిగుమతులు త‌గ్గిపోయి ఆ దేశానికి న‌ష్టం చేకూరుతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ నుంచి దిగుమతి చేసుకునే పండ్ల‌పై 50 శాతం,
సిమెంట్‌పై 7.5 శాతం క‌స్ట‌మ్స్ డ్యూటీ ఉండేది.

First Published:  16 Feb 2019 8:42 PM GMT
Next Story