Telugu Global
NEWS

ప‌వ‌న్ వ్యూహాన్ని ఫాలో అవుతున్న ర‌జ‌నీ

క‌ష్ట‌ప‌డకుండా సినిమా క్రేజ్‌తో రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునే వారి సంఖ్య మ‌న దేశంలో ఎక్కువే. త‌మ కెపాసిటీ జ‌నానికి ఓట్ల అంకెల రూపంలో అర్థం కాకుండా దాచి… తీరా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డైరెక్ట్‌గా పోటీ చేసి అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకునే రాజ‌కీయాలు సినీ న‌టుల పార్టీల్లో అధికంగా ఉంటాయి. ఇప్పుడు రజ‌నీకాంత్ కూడా అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్టు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన ఆయ‌న‌… పార్టీ ప‌రంగా ఇంకా ఏ కార్యక్రమాలు మొద‌లుపెట్ట‌లేదు. ఇంతలో లోక్‌స‌భ ఎన్నిక‌లు […]

ప‌వ‌న్ వ్యూహాన్ని ఫాలో అవుతున్న ర‌జ‌నీ
X

క‌ష్ట‌ప‌డకుండా సినిమా క్రేజ్‌తో రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునే వారి సంఖ్య మ‌న దేశంలో ఎక్కువే. త‌మ కెపాసిటీ జ‌నానికి ఓట్ల అంకెల రూపంలో అర్థం కాకుండా దాచి… తీరా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డైరెక్ట్‌గా పోటీ చేసి అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకునే రాజ‌కీయాలు సినీ న‌టుల పార్టీల్లో అధికంగా ఉంటాయి. ఇప్పుడు రజ‌నీకాంత్ కూడా అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్టు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన ఆయ‌న‌… పార్టీ ప‌రంగా ఇంకా ఏ కార్యక్రమాలు మొద‌లుపెట్ట‌లేదు. ఇంతలో లోక్‌స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఆయ‌న పోటీ చేస్తారా లేదా అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇందుకు ర‌జ‌నీ కాంత్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాము లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.

త‌న టార్గెట్ 2021లో జ‌రిగే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లేన‌ని ప్ర‌క‌టించారు. సేఫ్టీ కోస‌మే ఆయ‌న ఇలా ప్ర‌క‌టించారు. జ‌నం మారిన నేటి త‌రంలో సినిమా గ్లామ‌ర్ ఆధారంగా ఏకంగా అధికారంలోకి వ‌చ్చేంత సీనో… సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించే స‌న్నివేశ‌మో అంత ఈజీ కాదు. ఓట్లు ఇప్పుడు ఊరికే రావు. ఆ విష‌యం ర‌జ‌నీకి తెలుసు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి అక్క‌డ అనుకున్నంత ప‌నిత‌నం పార్టీ చూప‌క‌పోతే ఇక అంతే సంగ‌తులు.

ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చే ఓట్లు కూడా రావు. ఎందుకంటే సినిమా ఆధారిత ఓట‌ర్లు… త‌మ అభిమాన హీరో అధికారంలోకి వ‌చ్చేస్తార‌న్న ఆశ‌తో ఓటేస్తారు. కానీ అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే ముందే ఇత‌ర ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోతే… ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో అభిమానులు కూడా పెద్ద‌గా ఓటేయ‌రు. ఎందుకంటే ఏ ఓట‌రు కూడా త‌న ఓటు మురిగిపోతుందంటే ఒప్పుకోరు.

అందుకే ర‌జ‌నీ కాంత్ కూడా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌నది నిజ‌మైన బ‌ల‌మో, బ‌లుపో బ‌య‌ట‌పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. డైరెక్ట్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ల‌క్ ఉంటే పీఠం, లేకుంటే మ‌ళ్లీ యాక్ష‌న్. అక్క‌డ ర‌జ‌నీ కాంతే కాదు… ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా గ‌త ఐదేళ్లుగా ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దిగ‌కుండా… త‌న అస‌లైన బ‌లం ఏంటో ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ ప‌డుతున్నారు.

First Published:  17 Feb 2019 1:02 AM GMT
Next Story