ఆడియో రిలీజ్ రద్దు…. ఓన్లీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌?

అంతా అనుకున్నట్టే జరిగింది. మహర్షి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 5 నుంచి వాయిదాపడిన ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అదే టైమ్ లో ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు.

మహర్షి ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే 2 పోస్టర్లు విడుదలయ్యాయి. రెండు పోస్టర్లలో రెండు గెటప్స్ లో మహేష్ కనిపించాడు. ఇప్పుడు మూడో గెటప్ రిలీజ్ చేస్తారా లేక రెగ్యులర్ స్టిల్ నే వదుల్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను మార్చి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు.

మహర్షి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ క్లిప్ విడుదలైంది. కానీ మేకర్స్ దానిని టీజర్ గా చెప్పడం లేదు. అసలైన టీజర్ మార్చి మొదటి వారంలో, ట్రయిలర్ ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తారట. ఆడియో రిలీజ్ ను రద్దుచేసి, సినిమా రిలీజ్ కు వారం ముందు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ప్లాన్ చేశారు.