Telugu Global
Cinema & Entertainment

నాగ్ సరసన మళ్లీ అనుష్క

మొన్నటివరకు కాస్త బొద్దుగా ఉండేది అనుష్క. దీంతో ఆమె ఇక సినిమాలు తగ్గించేస్తుందని, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అనుష్క మాత్ర మేకోవర్ అయింది. ఓ 4 నెలలు టైమ్ తీసుకొని, విదేశాలకు వెళ్లి మరీ సన్నబడింది. లేటెస్ట్ గా వచ్చిన అనుష్క స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనుష్క ఇలా స్లిమ్ అయిందో లేదో వెంటనే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. అవును.. వచ్చే నెల నుంచి […]

నాగ్ సరసన మళ్లీ అనుష్క
X

మొన్నటివరకు కాస్త బొద్దుగా ఉండేది అనుష్క. దీంతో ఆమె ఇక సినిమాలు తగ్గించేస్తుందని, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అనుష్క మాత్ర మేకోవర్ అయింది. ఓ 4 నెలలు టైమ్ తీసుకొని, విదేశాలకు వెళ్లి మరీ సన్నబడింది. లేటెస్ట్ గా వచ్చిన అనుష్క స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనుష్క ఇలా స్లిమ్ అయిందో లేదో వెంటనే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున.

అవును.. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న మన్మధుడు-2 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అనుష్కను సెలక్ట్ చేశారు. నాగ్-అనుష్క కాంబోలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఆమధ్య నాగ్ నటించిన కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది అనుష్క. ఇప్పుడు స్లిమ్ అయి మరోసారి నాగ్ సరసన ఛాన్స్ పట్టేసింది.

మార్చి మొదటి వారంలో పోర్చుగల్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై రాబోతున్న ఈ రొమాంటిక్ ఎఁటర్ టైనర్ కు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. పాయల్ రాజ్ పుత్ సెకెండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు.

First Published:  17 Feb 2019 9:16 AM GMT
Next Story