Telugu Global
Cinema & Entertainment

శ్రియ స్థానంలో పాయల్ రాజ్ పుత్

అంజలి, నయనతార, శ్రియ, తమన్న.. ఓ సెక్షన్ లో వీళ్లకు ఎదురులేదు. అదేంటంటే బడా హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అన్నమాట. బాలయ్య, వెంకటేశ్ లాంటి హీరోలు సినిమాలు తీయాలంటే వీళ్లు మాత్రమే ఆ సినిమాలో సూట్ అవుతారు. యంగ్ హీరోయిన్స్ అంతా సీనియర్ హీరోలకు దూరం. ఇప్పుడీ లిస్ట్ లో కూడా పోటీ పెరిగిపోతోంది. తాజాగా పాయల్ కూడా వచ్చి చేరింది. అవును.. వెంకటేశ్, నాగార్జున సినిమాలకు చకచకా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసింది పాయల్ రాజ్ […]

శ్రియ స్థానంలో పాయల్ రాజ్ పుత్
X

అంజలి, నయనతార, శ్రియ, తమన్న.. ఓ సెక్షన్ లో వీళ్లకు ఎదురులేదు. అదేంటంటే బడా హీరోల సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అన్నమాట. బాలయ్య, వెంకటేశ్ లాంటి హీరోలు సినిమాలు తీయాలంటే వీళ్లు మాత్రమే ఆ సినిమాలో సూట్ అవుతారు. యంగ్ హీరోయిన్స్ అంతా సీనియర్ హీరోలకు దూరం. ఇప్పుడీ లిస్ట్ లో కూడా పోటీ పెరిగిపోతోంది. తాజాగా పాయల్ కూడా వచ్చి చేరింది.

అవును.. వెంకటేశ్, నాగార్జున సినిమాలకు చకచకా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసింది పాయల్ రాజ్ పుత్. వచ్చే వారం నుంచి సెట్స్ పైకి రాబోతున్న వెంకీ మామ సినిమాలో వెంకీ సరసన పాయల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మొదట శ్రియను అనుకొని, ఆమెను తప్పించి ఆ స్థానంలో పాయల్ ను తీసుకున్నారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మన్మధుడు-2లో కూడా పాయల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు.

మొన్నటివరకు ఈ సీనియర్ హీరోలకు ఆప్షన్లు చాలా తక్కువగా ఉండేది. కుదిరితే నయనతార, కుదరకపోతే శ్రియ అన్నట్టుండేది పరిస్థితి. తాజాగా ఎఫ్2లో వెంకీ సరసన తమన్న నటించడంతో వీళ్లకు ఆప్షన్లు పెరిగాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి పాయల్ కూడా చేరడంతో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత కాస్త తగ్గినట్టే.

First Published:  17 Feb 2019 9:11 AM GMT
Next Story