Telugu Global
Cinema & Entertainment

మరోసారి హీరోయిన్ ని రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత” వంటి సినిమాని తెరకెక్కించి చాలా కాలం తరువాత కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “జులాయి” “సన్ అఫ్ సత్యమూర్తి” వంటి సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాకి మంచి […]

మరోసారి హీరోయిన్ ని రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
X

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో “అరవింద సమేత” వంటి సినిమాని తెరకెక్కించి చాలా కాలం తరువాత కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో “జులాయి” “సన్ అఫ్ సత్యమూర్తి” వంటి సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాకి మంచి హైప్ ఉంది.

ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మిక ని అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ తాను రాసుకున్న పాత్రకి రష్మిక మరీ చిన్నది అయిపోతుంది అని భావించిన త్రివిక్రమ్ ఇప్పుడు మనసు మార్చుకొని మరో సారి పూజ హెగ్డే కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పూజ హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత” సినిమాలో నటించింది. అలాగే అల్లు అర్జున్ తో కూడా “డీజే” సినిమాలో నటించింది.

ఇక ప్రస్తుతం ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన “మహర్షి” సినిమాలో నటిస్తుంది. ఈ విషయం లో గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ వారి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

First Published:  17 Feb 2019 12:48 AM GMT
Next Story