Telugu Global
Cinema & Entertainment

"ఆర్. ఆర్.ఆర్" లో మూడు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అందరిలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని ఫైట్ సీన్స్ […]

ఆర్. ఆర్.ఆర్ లో మూడు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్
X

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అందరిలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని ఫైట్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు రాజమౌళి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ తాలూకు ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. అవును బ్రిటిష్ ఆఫీసర్ గా, ఒక మాస్ లీడర్ గా, అలాగే స్వాతంత్ర సమరయోధుడిగా రామ్ చరణ్ పాత్రలు ఉంటాయట. ఓకే పాత్రలో రామ్ చరణ్ ఈ వేరియేషన్స్ చూపిస్తాడా? లేకపోతే ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

First Published:  17 Feb 2019 12:55 AM GMT
Next Story