Telugu Global
NEWS

వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయంలో వెరైటీ క్రికెట్ మ్యాచ్

ధోవతులే యూనిఫామ్…సంస్కృతంలో కామెంట్రీ అంపైర్లు పంచెలు ధరించి మరీ అంపైరింగ్ ఇంగ్లండ్ లో పుట్టి భారత్ లో అనధికారిక జాతీయక్రీడగా మారిన క్రికెట్ అంటే…కోట్లాదిమంది భారత పౌరులకు ఉన్న అభిమానం అంతాకాదు. దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకూ…ఎక్కడ చూసినా బ్యాటు… బాలు పట్టుకొని తమకు నచ్చినరీతిలో క్రికెట్ ఆడుతూ కనిపించేవారు ఎందరో ఎందరెందరో.  సాధారణంగా…పెద్దమనుషుల క్రీడ క్రికెట్ అనగానే….సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లైతే తెలుపురంగు దుస్తులు, వన్డే […]

వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయంలో వెరైటీ క్రికెట్ మ్యాచ్
X
  • ధోవతులే యూనిఫామ్…సంస్కృతంలో కామెంట్రీ
  • అంపైర్లు పంచెలు ధరించి మరీ అంపైరింగ్

ఇంగ్లండ్ లో పుట్టి భారత్ లో అనధికారిక జాతీయక్రీడగా మారిన క్రికెట్ అంటే…కోట్లాదిమంది భారత పౌరులకు ఉన్న అభిమానం అంతాకాదు.

దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకూ…ఎక్కడ చూసినా బ్యాటు… బాలు పట్టుకొని తమకు నచ్చినరీతిలో క్రికెట్ ఆడుతూ కనిపించేవారు ఎందరో ఎందరెందరో.

సాధారణంగా…పెద్దమనుషుల క్రీడ క్రికెట్ అనగానే….సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ లైతే తెలుపురంగు దుస్తులు, వన్డే లేదా టీ-20 క్రికెట్ మ్యాచ్ ల్లో రంగురంగుల జెర్సీలు ధరించి క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ ఉంటే…. ఇంగ్లీష్ , హిందీ, ప్రాంతీయ భాషల్లో క్రికెట్ కామెంట్రీ చెప్పడం మామూలు విషయమే.

అయితే….వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఓ వెరైటీ క్రికెట్ టోర్నీ నిర్వహించారు.

సంస్కృత విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్న విద్యార్ధులు…ఐదుజట్లుగా ఏర్పడి…మ్యాచ్ ల్లో తలపడ్డారు. క్రికెట్ దుస్తులను పక్కన పెట్టి ధోవతులు, కుర్తాలు ధరించి మరీ మ్యాచ్ లు ఆడారు.

మ్యాచ్ లకు అంపైర్లుగా వ్యవహరించిన ధీరజ్ మిశ్రా, సంజీప్ తివారీ ఇద్దరూ మాజీ రంజీ ఆటగాళ్లే అయినా…సాంప్రదాయ పంచెకట్టుతో అలరించారు.

అంతేకాదు…ఈమ్యాచ్ ల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని సైతం దేవభాష సంస్కృతంలో చేయటం మరో విశేషం.

ఇంగ్లీష్ గడ్డపై పుట్టి పెరిగిన జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కు…భారత సాంప్రదాయ హంగులు అద్దితే…అదే ధోవతుల క్రికెట్ అన్నా ఆశ్చర్యం లేదు.

First Published:  17 Feb 2019 4:00 AM GMT
Next Story