Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా పై మెగా ఫ్యామిలీ కన్ను పడింది

రణ్ వీర్ సింగ్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా జోయ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గల్లి బాయ్”. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి వస్తున్న టాక్ చూసి తెలుగు నిర్మాతలు అందరూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే […]

ఆ సినిమా పై మెగా ఫ్యామిలీ  కన్ను పడింది
X

రణ్ వీర్ సింగ్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా జోయ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గల్లి బాయ్”. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

హైదరాబాద్ లో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి వస్తున్న టాక్ చూసి తెలుగు నిర్మాతలు అందరూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని కొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ అల్లు అరవింద్ గనుక ఈ ప్రాజెక్ట్ పక్కా ఆయనకే వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి మెగా హీరోలందరికీ చాలా ఆసక్తి ఉందట. కానీ ఈ సినిమాలో స్టార్ ని పెట్టడం కంటే కూడా సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలని పెట్టడం మంచిదని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. మరి ఈ సినిమాలో నటించే ఆ మెగా హీరో ఎవరు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  18 Feb 2019 7:06 AM GMT
Next Story