Telugu Global
Cinema & Entertainment

అది సైలెన్స్ కాదు.... నిశ్శబ్దం

స్లిమ్ అయిన అనుష్క ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు ”సైలెన్స్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు మొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ”నిశ్శబ్దం” అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు ఈ పేరును ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై వస్తోంది ”నిశ్శబ్దం” అనే సినిమా. ఈ సినిమాకు హేమంత్ […]

అది సైలెన్స్ కాదు.... నిశ్శబ్దం
X

స్లిమ్ అయిన అనుష్క ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు ”సైలెన్స్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు మొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ”నిశ్శబ్దం” అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు ఈ పేరును ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు.

కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై వస్తోంది ”నిశ్శబ్దం” అనే సినిమా. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, అంజలి, సుబ్బరాజు ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారు.

కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో ఉంటుంది. తొలి షెడ్యూల్ ను కూడా అమెరికాలోనే ప్లాన్ చేశారు. కాకపోతే ఇప్పుడు అమెరికాలో షూటింగ్స్ పెట్టుకోవడం తలకు మించిన భారంగా మారింది. వీసా ప్రాసెస్ చాలా క్లిష్టంగా తయారైంది. దీంతో కథలో బ్యాక్ డ్రాప్ మారుస్తారా లేక వీసాలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా అనేది చూడాలి.

First Published:  18 Feb 2019 2:20 AM GMT
Next Story