Telugu Global
Cinema & Entertainment

అవకాశంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చిన బాలక్రిష్ణ?

డైరెక్టర్ బోయపాటి శ్రీను నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా “వినయ విధేయ రామ”. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అటు రామ్ చరణ్ కెరీర్ లో, ఇటు బోయపాటి శ్రీను కెరీర్ లో ఈ సినిమానే పెద్ద డిజాస్టర్ గా ఉంది. ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా బాలక్రిష్ణతో బోయపాటి శ్రీనుకి అవకాశం వచ్చింది. కానీ అది కూడా కొన్ని వార్నింగ్స్,  కండిషన్స్ వల్లేనట. ఇంతకీ ఆ […]

అవకాశంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చిన బాలక్రిష్ణ?
X

డైరెక్టర్ బోయపాటి శ్రీను నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా “వినయ విధేయ రామ”. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అటు రామ్ చరణ్ కెరీర్ లో, ఇటు బోయపాటి శ్రీను కెరీర్ లో ఈ సినిమానే పెద్ద డిజాస్టర్ గా ఉంది. ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా బాలక్రిష్ణతో బోయపాటి శ్రీనుకి అవకాశం వచ్చింది. కానీ అది కూడా కొన్ని వార్నింగ్స్, కండిషన్స్ వల్లేనట.

ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటంటే సినిమా బడ్జెట్ నలబై కోట్లకి మించకూడదట. అలాగే సినిమా మొత్తం బాలక్రిష్ణ చెప్పిన బడ్జెట్ లోనే పూర్తి కావాలి. అదే విధంగా బోయపాటి శ్రీను కోసం సెపరేట్ ఆఫీస్ ని కూడా ఇవ్వలేదట బాలక్రిష్ణ.

ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ ని ఎన్.బి.కే ఫిలింస్ ఆఫీస్ లోనే పూర్తి చేయాలని బాలక్రిష్ణ ప్లాన్. ఇక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బోయపాటి శ్రీను కి “లెజెండ్” ని మించిన హిట్ కావాలి. అలాగే బాలక్రిష్ణ కి కూడా ఒక హిట్ ఎంతో అవసరం. మరి ఇన్ని కండిషన్స్ నడుమ ఆ హిట్ సాధ్యమేనా ?

First Published:  17 Feb 2019 11:52 PM GMT
Next Story