Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కు హిట్ డైరక్టర్ దొరికాడోచ్

హిట్స్ లేకపోయినా హిట్ డైరక్టర్ ను పట్టుకోవడంలో అఖిల్ ఎప్పుడూ ముందుంటున్నాడు. హలో సినిమాకు విక్రమ్ కుమార్ లాంటి సక్సెస్ ఫుల్ డైరక్టర్ ను పట్టుకున్నాడు. తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను చేశాడు. ఇప్పుడు ఏకంగా పరశురాం లాంటి డైరక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురారం దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు. ఈ కాంబినేషన్ ను అల్లు అరవింద్ సెట్ చేశారు. వరుసగా ఫ్లాపులు రావడంతో ఈసారి […]

అఖిల్ కు హిట్ డైరక్టర్ దొరికాడోచ్
X

హిట్స్ లేకపోయినా హిట్ డైరక్టర్ ను పట్టుకోవడంలో అఖిల్ ఎప్పుడూ ముందుంటున్నాడు. హలో సినిమాకు విక్రమ్ కుమార్ లాంటి సక్సెస్ ఫుల్ డైరక్టర్ ను పట్టుకున్నాడు. తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను చేశాడు. ఇప్పుడు ఏకంగా పరశురాం లాంటి డైరక్టర్ తో సినిమా చేయబోతున్నాడు.

గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురారం దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు. ఈ కాంబినేషన్ ను అల్లు అరవింద్ సెట్ చేశారు. వరుసగా ఫ్లాపులు రావడంతో ఈసారి గీతాఆర్ట్స్ బ్యానర్ కు కొడుకును అప్పగించాడు నాగ్. ఆల్రెడీ ఈ బ్యానర్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్, పరశురాంలో ఒకరితో సినిమా చేయాలని అల్లు అరవింద్ భావించాడు. అలా అఖిల్-పరశురాం కాంబో ఫిక్స్ అయింది.

ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు సాగుతున్నాయి. స్టోరీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. నిజానికి గీతగోవిందం తర్వాత బన్నీతో సినిమా చేయడానికి చాలా ప్రయత్నించాడు పరశురాం. కానీ మధ్యలో త్రివిక్రమ్ రావడంతో ఆ ఛాన్స్ చేజారిపోయింది. ఇక ఎవరూ లేకపోవడంతో ఇలా అఖిల్ తో సినిమా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది.

First Published:  17 Feb 2019 11:23 PM GMT
Next Story