Telugu Global
Cinema & Entertainment

సెట్స్ లో గాయపడ్డ హీరో గోపీచంద్

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో ఒక పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ స్పై గా నటిస్తున్నాడు. మొన్నటి వరకు ఇండో-పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకొని వచ్చిన ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం జైపూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో గోపీచంద్ గాయపడ్డాడు. ప్రస్తుతం జైపూర్ లో ఒక బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ తిరు. […]

సెట్స్ లో గాయపడ్డ హీరో గోపీచంద్
X

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో ఒక పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ స్పై గా నటిస్తున్నాడు.

మొన్నటి వరకు ఇండో-పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకొని వచ్చిన ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం జైపూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో గోపీచంద్ గాయపడ్డాడు.

ప్రస్తుతం జైపూర్ లో ఒక బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ తిరు. అయితే ఈ సీక్వెన్స్ లో గోపీచంద్ తన బైక్ ని తానే నడుపుతున్నాడు. అలా తన బైక్ ని స్పీడ్ గా నడుపుతున్న గోపీచంద్ సడన్ గా స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. కింద పడి గాయపడ్డ గోపీచంద్ ను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు.

గాయాల నుంచి తెరుకోగానే గోపీచంద్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాడట. అనిల్ సుంకర ఈ సినిమాని దాదాపు 30 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

First Published:  18 Feb 2019 4:23 AM GMT
Next Story