Telugu Global
NEWS

16 మంది మంత్రులు.... కేసీఆర్ పూర్తి స్థాయి కేబినెట్?

సీఎం కేసీఆర్ రేపు పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 8 నుంచి 10 మందితో చిన్న కేబినెట్ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 16 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీతో కలిపి కొత్త మంత్రలు 16 మంది ప్రమాణం చేస్తే ఇక తర్వాత విస్తరణకు అవకాశం ఉండదు. […]

16 మంది మంత్రులు.... కేసీఆర్ పూర్తి స్థాయి కేబినెట్?
X

సీఎం కేసీఆర్ రేపు పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 8 నుంచి 10 మందితో చిన్న కేబినెట్ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 16 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీతో కలిపి కొత్త మంత్రలు 16 మంది ప్రమాణం చేస్తే ఇక తర్వాత విస్తరణకు అవకాశం ఉండదు.

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఉండేలా పూర్తి స్థాయిలో విస్తరిస్తేనే సబబుగా ఉంటుందని.. ప్రభుత్వ పనులను కూడా వేగవంతం చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. ఇవాళ కొత్త మంత్రులను ప్రగతిభవన్‌కు పిలించి అసలు విషయాన్ని చెప్పినట్లు సమాచారం. రేపు ఉదయం పదకొండున్నరకు రాజ్‌భవన్‌లో 16 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

ఇక ఈ రోజు యర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్ కేబినెట్‌లో స్థానం ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పడితే భవిష్యత్‌లో కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలంటే పాత వారితో రాజీనామా చేయించాల్సిందే.

First Published:  18 Feb 2019 7:40 AM GMT
Next Story