Telugu Global
National

ఉగ్ర‌దాడిని స‌మ‌ర్ధించిన‌ మ‌హిళా టీచ‌ర్ అరెస్ట్

పుల్వామాలో ఉగ్ర‌దాడిపై దేశ‌మంతా ర‌గిలిపోతుంటే… సంబ‌ర‌ప‌డుతున్న వ్య‌క్తులు కూడా దేశంలోనే బ‌తుకుతున్నారు. అలాంటి ప‌నే చేసిన టీచ‌ర్‌ను క‌ర్నాట‌క‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బెళ‌గావిలోని శివ‌పురలో ప్రైవేట్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న జిలేఖాబి … ఉగ్ర‌వాదుల దాడి త‌ర్వాత ఆ చ‌ర్య‌ను స‌మ‌ర్ధిస్తూ పోస్టు పెట్టింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌గ్గుమన్నారు. ఆగ్ర‌హించిన స్థానికులు ఆమె ఇంటిని త‌గ‌ల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని టీచ‌ర్‌ను అరెస్ట్ చేశారు. సెక్ష‌న్ 121 ఏ, 153, 153 ఏ కింద కేసు […]

ఉగ్ర‌దాడిని స‌మ‌ర్ధించిన‌ మ‌హిళా టీచ‌ర్ అరెస్ట్
X

పుల్వామాలో ఉగ్ర‌దాడిపై దేశ‌మంతా ర‌గిలిపోతుంటే… సంబ‌ర‌ప‌డుతున్న వ్య‌క్తులు కూడా దేశంలోనే బ‌తుకుతున్నారు. అలాంటి ప‌నే చేసిన టీచ‌ర్‌ను క‌ర్నాట‌క‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బెళ‌గావిలోని శివ‌పురలో ప్రైవేట్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న జిలేఖాబి … ఉగ్ర‌వాదుల దాడి త‌ర్వాత ఆ చ‌ర్య‌ను స‌మ‌ర్ధిస్తూ పోస్టు పెట్టింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌గ్గుమన్నారు.

ఆగ్ర‌హించిన స్థానికులు ఆమె ఇంటిని త‌గ‌ల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని టీచ‌ర్‌ను అరెస్ట్ చేశారు. సెక్ష‌న్ 121 ఏ, 153, 153 ఏ కింద కేసు న‌మోదు చేశారు. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఇప్ప‌టికే ఉగ్ర‌దాడిని స‌మ‌ర్ధించిన బార‌ముల్లా జిల్లాకు చెందిన తాహీర్‌, మ‌రో క‌శ్మీర్ విద్యార్థి అబిద్ మాలిక్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

First Published:  17 Feb 2019 11:00 PM GMT
Next Story