Telugu Global
Cinema & Entertainment

కల్కి షూటింగ్ అప్ డేట్స్

రాజశేఖర్ బిరుదు మారిపోయిందిప్పుడు. ఒకప్పట్లా అతడ్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అనకూడదు. ఎందుకంటే రాజశేఖర్ ఇప్పుడు యంగ్ కాదు కదా. వాళ్ల అమ్మాయిలు కూడా హీరోయిన్లు అయిపోయారు. అందుకే ఆ బిరుదును కాస్త మార్చి యాంగ్రీ స్టార్ గా పెట్టారు. సో..ఇప్పుడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బాదామిలో జరుగుతోంది. అక్కడున్న ఓ రేర్ […]

కల్కి షూటింగ్ అప్ డేట్స్
X

రాజశేఖర్ బిరుదు మారిపోయిందిప్పుడు. ఒకప్పట్లా అతడ్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అనకూడదు. ఎందుకంటే రాజశేఖర్ ఇప్పుడు యంగ్ కాదు కదా. వాళ్ల అమ్మాయిలు కూడా హీరోయిన్లు అయిపోయారు. అందుకే ఆ బిరుదును కాస్త మార్చి యాంగ్రీ స్టార్ గా పెట్టారు. సో..ఇప్పుడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం…

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బాదామిలో జరుగుతోంది. అక్కడున్న ఓ రేర్ లొకేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. అంతకంటే ముందు బెంగళూరులో ఓ షెడ్యూల్ పూర్తిచేసింది కల్కి యూనిట్.

బాదామి షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా ముంబయి వెళ్తుంది. ముంబయిలో 10 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. హైదరాబాద్ షెడ్యూల్ తో కల్కి టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం 80శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని భావిస్తున్నారు. మే నెలలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. ఇందులో రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ విల్సన్ అనే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

First Published:  17 Feb 2019 10:46 PM GMT
Next Story