Telugu Global
Cinema & Entertainment

"మీకు మాత్రమే చెప్తా" అంటున్న.... విజయ్ దేవరకొండ, తరుణ్

“పెళ్లి చూపులు” సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్, ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకి తొలి బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ హిట్ తో తెలుగు ఇండస్ట్రీ లో వీళ్ళిద్దరూ బాగా సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది కూడా. అయితే ఈ సినిమా కోసం “మీకు […]

మీకు మాత్రమే చెప్తా అంటున్న.... విజయ్ దేవరకొండ, తరుణ్
X

“పెళ్లి చూపులు” సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్, ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకి తొలి బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ హిట్ తో తెలుగు ఇండస్ట్రీ లో వీళ్ళిద్దరూ బాగా సెటిల్ అయ్యారు.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది కూడా. అయితే ఈ సినిమా కోసం “మీకు మాత్రమే చెప్తా” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు విజయ్ దేవరకొండ.

ఇలాంటి టైటిల్ విజయ్ దేవరకొండ రిజిస్టర్ చేయించాడు కాబట్టి ఈ సినిమా పై ఇప్పుడు అందరి కన్ను పడింది. ఈ సినిమా కోసం దాస్యం తరుణ్ భాస్కర్ లావు తగ్గాడు. అలాగే గడ్డం తీసేసాడు కూడా.

మొత్తానికి తనని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన అనసూయ ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

First Published:  17 Feb 2019 10:56 PM GMT
Next Story