ప‌రుగు పందెంలో యువ‌తి మృతి

క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన పోలీస్ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. పరుగు పందెంలో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

ర‌న్నింగ్ రేసులో పాల్గొన్న మ‌మ‌త అనే విద్యార్థిని ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప‌డిపోయింది. హార్ట్ బీట్ ఎక్కువ అవ‌డంతో మ‌మ‌త ప‌డిపోయింది. పోలీసులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే చ‌నిపోయింది.

మృతురాలు మ‌మ‌త‌ది రామ‌డుగు మండ‌లం వెలిచాల గ్రామం. మ‌మ‌త మృతి విష‌యాన్ని పోలీసులు ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. దీంతో మ‌మ‌త గ్రామంలో విషాద చాయ‌లు అల‌ముకున్నాయి.