Telugu Global
NEWS

మేం బుజ్జగించాం.... మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు ?

“ గతంలో పార్టీని వ్యతిరేకించిన వారిని, టిక్కెట్లు రాకపోతే రోడ్డు పై బైటాయించి ఆగ్రహించిన వారిని సీనియర్లుగా మేమే బుజ్జగించాం. ఇప్పుడు మాకే పార్టీలో ఇబ్బందులు వస్తున్నాయి. సీనియర్ లైన మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు” ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోని సీనియర్ నాయకులు ఆవేదన. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది సీనియర్లు పార్టీని భుజానికెత్తుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా.. తమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలు తూ.చా తప్పక పాటిస్తూ […]

మేం బుజ్జగించాం.... మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు ?
X

“ గతంలో పార్టీని వ్యతిరేకించిన వారిని, టిక్కెట్లు రాకపోతే రోడ్డు పై బైటాయించి ఆగ్రహించిన వారిని సీనియర్లుగా మేమే బుజ్జగించాం. ఇప్పుడు మాకే పార్టీలో ఇబ్బందులు వస్తున్నాయి. సీనియర్ లైన మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు” ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోని సీనియర్ నాయకులు ఆవేదన.

తెలంగాణ ఉద్యమం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది సీనియర్లు పార్టీని భుజానికెత్తుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా.. తమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలు తూ.చా తప్పక పాటిస్తూ ఉద్యమాన్ని, ఆ తర్వాత ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యేలా ఉన్నాయి.

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గతంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ మాత్రం చాలా ఆలస్యంగా చేపట్టారు.

ఇన్నాళ్లూ పార్టీని వెన్నంటి ఉన్న సీనియర్లకు ఈ క్యాబినెట్లో అవకాశం ఉంటుందని వారితో పాటు పార్టీలోనూ అందరూ ఆశించారు. అయితే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మాత్రం ఇందుకు భిన్నంగా కొత్తగా ఎన్నికైన వారికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలను పార్టీ సీనియర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. తెలంగాణలోని 119 నియోజక వర్గాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో అసంతృప్తులు, టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు. వారంతా పార్టీని ఎదిరించి ఎన్నికల్లో నామినేషన్ లు కూడా వేశారు. అలాంటి వారిని బుజ్జగించే పని పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పార్టీలో సీనియర్ నాయకులకు అప్పగించారు. ఆ పనిని వారు సమర్థవంతంగా పూర్తి చేశారు. బుజ్జగించి, బతిమాలి, ఆశలు పెట్టి వారిని నామినేషన్లు ఉపసంహరించేలా చేశారు.

తీరా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కాదని కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీనియర్లు అలక బూనుతున్నారు. ” కష్టకాలంలో మేం కావాల్సి వచ్చింది. ఇప్పుడు మా అవసరం తీరింది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు మేం అందరిని బుజ్జగించాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు ” అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

First Published:  17 Feb 2019 11:14 PM GMT
Next Story