Telugu Global
NEWS

పార్టీలో అడుగ‌డుగునా అవ‌మానాలే " ఆనం

నెల్లూరు టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్థిగా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంపై ఆనం జ‌య‌కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్ర‌బాబు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని న‌మ్మించి మోసం చేశార‌ని మండిప‌డ్డారు. టీడీపీలో త‌న‌కు అడుగ‌డుగున అవ‌మానాలే మిగిలాయ‌ని జ‌య‌కుమార్ రెడ్డి ఆవేద‌న చెందారు. త‌న భుజాల‌పై తుపాకి పెట్టి చివ‌ర‌కు త‌న‌నే కాల్చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరు రూర‌ల్ టికెట్ నీకే అని చెప్ప‌డంతో సొంత డ‌బ్బుతో […]

పార్టీలో అడుగ‌డుగునా అవ‌మానాలే  ఆనం
X

నెల్లూరు టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్థిగా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంపై ఆనం జ‌య‌కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

చంద్ర‌బాబు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని న‌మ్మించి మోసం చేశార‌ని మండిప‌డ్డారు. టీడీపీలో త‌న‌కు అడుగ‌డుగున అవ‌మానాలే మిగిలాయ‌ని జ‌య‌కుమార్ రెడ్డి ఆవేద‌న చెందారు.

త‌న భుజాల‌పై తుపాకి పెట్టి చివ‌ర‌కు త‌న‌నే కాల్చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరు రూర‌ల్ టికెట్ నీకే అని చెప్ప‌డంతో సొంత డ‌బ్బుతో కార్య‌క్ర‌మాలు చేసి పార్టీని బ‌లోపేతం చేశాన‌ని… ఇప్పుడు హ‌ఠాత్తుగా మోసం చేసి ఆదాల‌కు టికెట్ ప్ర‌క‌టించార‌ని మండిప‌డ్డారు. ఇలాంటి పార్టీలో తాను ఉండలేన‌న్నారు. ఆనం జ‌య‌కుమార్ రెడ్డి పార్టీని వీడే అవ‌కాశం ఉంది.

First Published:  18 Feb 2019 2:04 AM GMT
Next Story