Telugu Global
NEWS

రూ. 131 కోట్ల కుంభ‌కోణం... రాత్రికి రాత్రి దొర రాజీనామా

ఏపీలో మ‌రో కుంభ‌కోణం వెలుగు చూసింది. తూర్పు ప్రాంత  విద్యుత్ పంపిణీ సంస్థ- ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర రాత్రికి రాత్రే రాజీనామా చేశారు. క‌వ‌ర్డ్ కండ‌క్ట‌ర్ల కొనుగోలులో 131 కోట్ల రూపాయ‌ల గోల్‌మాల్ జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డింది. ఈ కుంభ‌కోణంలో సీఎండీ దొర‌తో పాటు మ‌రో 30 మంది పాత్ర ఉన్న‌ట్టు తేల్చారు. దాని వ‌ల్లే హెచ్‌వై దొర రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న రాజీనామాను ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదించింది. ఈపీడీసీఎల్ సీఎండి బాధ్య‌త‌ల‌ను … ద‌క్షిణ పాంత్ర విద్యుత్ పంపిణీ […]

రూ. 131 కోట్ల కుంభ‌కోణం... రాత్రికి రాత్రి దొర రాజీనామా
X

ఏపీలో మ‌రో కుంభ‌కోణం వెలుగు చూసింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ- ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర రాత్రికి రాత్రే రాజీనామా చేశారు. క‌వ‌ర్డ్ కండ‌క్ట‌ర్ల కొనుగోలులో 131 కోట్ల రూపాయ‌ల గోల్‌మాల్ జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డింది.

ఈ కుంభ‌కోణంలో సీఎండీ దొర‌తో పాటు మ‌రో 30 మంది పాత్ర ఉన్న‌ట్టు తేల్చారు. దాని వ‌ల్లే హెచ్‌వై దొర రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న రాజీనామాను ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదించింది. ఈపీడీసీఎల్ సీఎండి బాధ్య‌త‌ల‌ను … ద‌క్షిణ పాంత్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీగా ఉన్న నాయ‌క్‌కు అద‌నంగా అప్ప‌గించారు.

క‌వ‌ర్డ్ కండ‌క్ట‌ర్ల కొనుగోలు కోసం బెంగ‌ళూరు సంస్థ‌కు టెండ‌ర్ అప్ప‌గించారు. ఆ సంస్థ‌ల‌కు అనుకూలంగా నిబంధ‌న‌లు మార్చ‌డం ద్వారా ప్ర‌జా ధ‌నాన్ని కొల్ల‌గొట్టార‌ని తేలింది. ఈ కొనుగోళ్లలో సంస్థకు రూ.131 కోట్ల నష్టం జరిగిందంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రుగుతుండ‌గానే దొర త‌ప్పుకున్నారు. దొర చంద్ర‌బాబుకు స‌న్నిహితుడు.

First Published:  18 Feb 2019 10:38 PM GMT
Next Story