Telugu Global
NEWS

రెండుదశలుగా ఐపీఎల్ 2019 పోటీలు

ప్రారంభమ్యాచ్ లో చెన్నై తో బెంగళూరు ఢీ సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండు అంచెలుగా ఐపీఎల్ హంగామా మొదటి రెండువారాలు 17 మ్యాచ్ ల సమరం ఐపీఎల్ 2019 సీజన్ మొదటి రెండువారాల మ్యాచ్ ల షెడ్యూల్ ను… నిర్వాహక సంఘం ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 12వ సీజన్ పోటీలను రెండు భాగాలుగా నిర్వహించడానికి…. ఐపీఎల్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 23న ప్రారంభమయ్యే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై […]

రెండుదశలుగా ఐపీఎల్ 2019 పోటీలు
X
  • ప్రారంభమ్యాచ్ లో చెన్నై తో బెంగళూరు ఢీ
  • సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండు అంచెలుగా ఐపీఎల్ హంగామా
  • మొదటి రెండువారాలు 17 మ్యాచ్ ల సమరం

ఐపీఎల్ 2019 సీజన్ మొదటి రెండువారాల మ్యాచ్ ల షెడ్యూల్ ను… నిర్వాహక సంఘం ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 12వ సీజన్ పోటీలను రెండు భాగాలుగా నిర్వహించడానికి…. ఐపీఎల్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.

మార్చి 23న ప్రారంభమయ్యే ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

మార్చి 23 నుంచి మొదటి రెండువారాలపాటు మొత్తం 17 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల హోంగ్రౌండ్స్ లో ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు ఐపీఎల్ బోర్డు ప్రకటించింది.

ప్రతి ఫ్రాంచైజీ హోంగ్రౌండ్లో రెండు, ప్రత్యర్థి గ్రౌండ్లో రెండుమ్యాచ్ లు ఆడే విధంగా కార్యక్రమం రూపొందించారు. హైదరాబాద్ సన్ రైజర్స్ మూడు హోం మ్యాచ్ లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు…. మూడు AWAY మ్యాచ్ ల్లో తలపడనున్నాయి.

First Published:  19 Feb 2019 5:50 AM GMT
Next Story