Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ హీరోని.... ఫ్లాప్ డైరెక్టర్ కాపాడుతాడా?

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. నాలుగేళ్ళలో మూడు సినిమాలు చేసినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. ఇక ఇప్పుడు నాగార్జున తన కొడుకు అఖిల్ ని తీసుకెళ్లి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. అల్లు అరవింద్ కూడా అఖిల్ కోసం ఒక మంచి కథ రాయమని హిట్ డైరెక్టర్ పరశురాం కి  చెప్పాడు. కానీ […]

ఫ్లాప్ హీరోని....  ఫ్లాప్ డైరెక్టర్ కాపాడుతాడా?
X

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. నాలుగేళ్ళలో మూడు సినిమాలు చేసినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే.

ఇక ఇప్పుడు నాగార్జున తన కొడుకు అఖిల్ ని తీసుకెళ్లి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. అల్లు అరవింద్ కూడా అఖిల్ కోసం ఒక మంచి కథ రాయమని హిట్ డైరెక్టర్ పరశురాం కి చెప్పాడు. కానీ ఇప్పుడు పరశురాం కి హిందీ సినిమా అయిన “గల్లి బాయ్” రీమేక్ బాధ్యతలని అప్పగించాడు అల్లు అరవింద్.

ఇక ఇప్పుడు అఖిల్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ ని సెట్ చేసాడట అరవింద్. తెలుగు ఇండస్ట్రీ కి “బొమ్మరిల్లు” లాంటి ఒక మంచి సినిమాని అందించిన బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. భాస్కర్ ఇప్పటికే అల్లు అరవింద్ కి ఒక కథ చెప్పాడట. అయితే ఈ కథ అఖిల్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించి అఖిల్ ని భాస్కర్ చేతిలో పెట్టాడట అల్లు అరవింద్. ఈ సినిమా పై గీత ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

First Published:  18 Feb 2019 11:46 PM GMT
Next Story