Telugu Global
NEWS

కుల రాజకీయాలపై కుల గురువు సీరియస్ ?

ఆయనకి కోపం వచ్చిందట. ఆయన ఆ సామాజిక వర్గం పెద్దలపై అలిగారట. అంతే కాదు… ప్రభుత్వంలో ఉన్న ఆ సామాజిక వర్గం వారిపై కూడా చిరుబుర్రులాడారట. ఆయన ఆ సామాజిక వర్గానికి కుల గురువులా వ్యవహరించే ఓ మీడియాధిపతి. దానికి కారణం ఏమనుకుంటున్నారా… గుట్టుగా… రహస్యంగా చేసుకోవాల్సిన అనేక పనులను బట్టబయలు చేస్తున్నారని, దీని వల్ల మూడు దశాబ్దాలుగా విస్తరించిన సామాజిక వర్గ ఆధిపత్యానికే దెబ్బ తగిలేలా ఉందని ఆయన కోపగించుకున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన […]

కుల రాజకీయాలపై కుల గురువు సీరియస్ ?
X

ఆయనకి కోపం వచ్చిందట. ఆయన ఆ సామాజిక వర్గం పెద్దలపై అలిగారట. అంతే కాదు… ప్రభుత్వంలో ఉన్న ఆ సామాజిక వర్గం వారిపై కూడా చిరుబుర్రులాడారట. ఆయన ఆ సామాజిక వర్గానికి కుల గురువులా వ్యవహరించే ఓ మీడియాధిపతి. దానికి కారణం ఏమనుకుంటున్నారా… గుట్టుగా… రహస్యంగా చేసుకోవాల్సిన అనేక పనులను బట్టబయలు చేస్తున్నారని, దీని వల్ల మూడు దశాబ్దాలుగా విస్తరించిన సామాజిక వర్గ ఆధిపత్యానికే దెబ్బ తగిలేలా ఉందని ఆయన కోపగించుకున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, పైగా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం, లెక్కలతో సహా వివరించడంతో ఆ పెద్దాయనకి కోపం కట్టలు తెంచుకుందని చెబుతున్నారు.

మూడు దశాబ్దాల క్రితమే భవిష్యత్ ను ఆలోచించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఆ పెద్దాయన తన సామాజిక వర్గానికి దెబ్బ తగలకుండా ఇన్నాళ్లూ కాపాడుకున్నామని, ఇప్పుడు ఇలా రోడ్డున పడేలా చేయడం మంచిది కాదని అన్నట్లు చెబుతున్నారు. “రాష్ట్రంలో ఇంటెలిజెన్సీ ఉంటుంది. పైగా దాని ఉన్నతాధికారి కూడా మన సామాజిక వర్గం వారే. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. పార్టీలో ఏం జరుగుతోంది వంటివి తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు. ఎవరైతే ఆరోపణలు చేసారో వారితో ముందుగా మాట్లాడితే ఇంత రచ్చ జరిగిదే కాదు కదా” అని ఆ పెద్దాయన మండిపడినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ ఏం జరిగినా పెదవి విప్పని వారంతా ఇక ముందు ఏది పడితే అది మాట్లాడతారని, ఇది ఏ ఒక్కరికో నష్టం కలిగించే అంశం కాదని కూడా ఆయన అన్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ లో ఇక ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి సామాజిక వర్గానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ పెద్దాయన సూచించినట్లు చెబుతున్నారు.

First Published:  18 Feb 2019 8:28 PM GMT
Next Story