Telugu Global
NEWS

ఓటమి కాదు.... తర్వాతే ఏం జరుగుతుందో ?

ఎన్నికల్లో ఓటమి పాలు కావడం…. తిరిగి నిలదొక్కుకుని మళ్లీ పుంజుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా సర్వసాధారణం. ఈ అనుభవం దేశాన్ని ఏలిన పెద్ద పెద్ద నాయకుల నుంచి చోటా మోటా నాయకుల వరకూ అందరికీ ఉంటుంది. అదే అనుభవం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా ఉంది. ఆయన ఓటమి ఎరుగని నాయకుడు కాదు. అయితే ఓటమి తర్వాత ఆయన నిలదొక్కుకుని రాజకీయాల్లో […]

ఓటమి కాదు.... తర్వాతే ఏం జరుగుతుందో ?
X

ఎన్నికల్లో ఓటమి పాలు కావడం…. తిరిగి నిలదొక్కుకుని మళ్లీ పుంజుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా సర్వసాధారణం. ఈ అనుభవం దేశాన్ని ఏలిన పెద్ద పెద్ద నాయకుల నుంచి చోటా మోటా నాయకుల వరకూ అందరికీ ఉంటుంది. అదే అనుభవం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా ఉంది. ఆయన ఓటమి ఎరుగని నాయకుడు కాదు.

అయితే ఓటమి తర్వాత ఆయన నిలదొక్కుకుని రాజకీయాల్లో మళ్లీ ఓ వెలుగు వెలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం కష్టమేనని అనేక సర్వేలు చెబుతున్నాయి. అయినా… చివరి వరకూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి ఎలాగైనా విజయ తీరాలకు చేరాలనేది చంద్రబాబు నాయుడి రాజకీయ చతురత.

ఈసారీ అలాగే చేసి విజయం సాధిస్తారేమోననే అనుమానాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నాయకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఓడిపోతే ఏం జరుగుతుంది…మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటాం. అంతేగా… అంతేగా… అనేది నిన్నటి వరకూ చంద్రబాబు నాయుడి మాట. అయితే అ మాట ఇప్పుడు మారుతోంది.

రానున్న ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం జరుగుతుందనేది చంద్రబాబు నాయుడిని వెంటాడుతున్న భయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. గతంలో ఎవ్వరికీ భయపడని చంద్రబాబు నాయుడు మారిన రాజకీయ సమీకరణల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు తీవ్రంగా భయపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీనికి నిదర్శనం…. గడచిన ఆరు నెలలుగా పలు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలేనని అంటున్నారు. “నా మీద ఏదో కుట్ర జరుగుతోంది. నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. అక్కలు… చెల్లెళ్లు… తమ్ముళ్లు… మీరంతా నన్ను కాపాడుకోవాలి. నాకు మీరే ఉన్నారు” అంటూ పలు సభల్లో చంద్రబాబు నాయుడు బహిరంగంగానే తన భయాన్ని వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలో ఆ భయం మరింత పెరిగిందంటున్నారు. తనపై ఉన్న పాత కేసులతో పాటు ఓటుకు నోటు కేసును తిరగతోడతారనే భయం ఆయన్ని వెంటాడుతోందని అంటున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అనే మాటనే ఆయన పదే పదే వల్లించడం వెనుక ఈ భయమే కారణమని చెబుతున్నారు.

First Published:  19 Feb 2019 5:30 AM GMT
Next Story