Telugu Global
National

81 మందిని చంపేద్దాం....

పుల్వామా ఉగ్ర‌దాడికి బ‌దులు ఇవ్వాల్సిందేన‌న్నారు పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్. ప్ర‌తి భార‌తీయుడు ఇప్పుడు ప్ర‌తీకారం కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. 41 మంది భార‌త జ‌వాన్ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్నందుకు ప్ర‌తీకారంగా 81 మంది పాక్ జ‌వాన్ల‌ను హ‌త‌మార్చాల‌న్నారు. మూర్ఖంగా భార‌త సైనికుల ప్రాణాలు తీస్తున్న పాకిస్థాన్‌తో శాంతి చ‌ర్చ‌ల‌కు కాలం చెల్లిపోయింద‌ని అమ‌రీంద‌ర్ సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు. పాక్‌ను సైనిక‌, ఆర్థిక‌, దౌత్య మార్గాల్లో క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నేల కొరిగిన ప్ర‌తి భార‌తీయ సైనికుడికి బ‌దులుగా పాక్‌కు చెందిన ఇద్ద‌రు సైనికుల‌ను చంపేయాల‌న్నారు. భార‌త్‌పై అణ్వాయుధాలు ప్ర‌యోగించే ద‌మ్ము పాకిస్థాన్‌కు […]

81 మందిని చంపేద్దాం....
X

పుల్వామా ఉగ్ర‌దాడికి బ‌దులు ఇవ్వాల్సిందేన‌న్నారు పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్. ప్ర‌తి భార‌తీయుడు ఇప్పుడు ప్ర‌తీకారం
కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. 41 మంది భార‌త జ‌వాన్ల‌ను పొట్ట‌న‌పెట్టుకున్నందుకు ప్ర‌తీకారంగా 81 మంది పాక్ జ‌వాన్ల‌ను హ‌త‌మార్చాల‌న్నారు. మూర్ఖంగా భార‌త సైనికుల ప్రాణాలు తీస్తున్న పాకిస్థాన్‌తో శాంతి చ‌ర్చ‌ల‌కు కాలం చెల్లిపోయింద‌ని అమ‌రీంద‌ర్ సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

పాక్‌ను సైనిక‌, ఆర్థిక‌, దౌత్య మార్గాల్లో క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నేల కొరిగిన ప్ర‌తి భార‌తీయ సైనికుడికి బ‌దులుగా పాక్‌కు చెందిన ఇద్ద‌రు సైనికుల‌ను చంపేయాల‌న్నారు. భార‌త్‌పై అణ్వాయుధాలు ప్ర‌యోగించే ద‌మ్ము పాకిస్థాన్‌కు లేద‌ని… అవ‌న్నీ ఒట్టి మాట‌లేన‌ని వ్యాఖ్యానించారు.

పాక్‌ డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌న్నారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఒక‌వైపు శాంతి చ‌ర్చ‌లంటార‌ని… మ‌రోవైపు పాక్ ఆర్మీ మాత్రం యుద్ధం గురించి మాట్లాడుతోంద‌ని అమ‌రీంద‌ర్ సింగ్ ధ్వ‌జ‌మెత్తారు. పాకిస్థాన్‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్ప‌క‌పోతే పుల్వామాలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతూనే ఉంటాయ‌న్నారు.

First Published:  18 Feb 2019 10:36 PM GMT
Next Story