కాస్టింగ్ కౌచ్ పై హాట్ హీరోయిన్ స్పందన

కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీరాయ్ వంతు వచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా వివిధ పరిశ్రమల మధ్య చక్కర్లు కొడుతున్న ఈ హాట్ బ్యూటీ, ఏ ఇండస్ట్రీలో తనకు వేధింపులు ఎదురుకాలేదని చెబుతోంది.

వేర్ ఈజ్ వెంకటలక్ష్మి మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ గురించి తనకు తెలుసని, కొందరి ఉదంతాలు కూడా తనవరకు వచ్చాయని అంటున్న రాయ్ లక్ష్మి, తనకు మాత్రం అలాంటి చేదు అనుభవాలు లేవని అంటోంది. ఇక మీ-టూపై కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం మీ-టూ ఉద్యమం పూర్తిగా పక్కదారి తప్పిందంటోంది రాయ్ లక్ష్మీ. వ్యక్తిగత కక్షల మధ్య మీ-టూ ఉద్యమం పూర్తిగా నీరుగారి పోయిందని, ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణల్లో ఎవరిది నిజమే, ఎవరిది అబద్ధమో కూడా చెప్పలేకపోతున్నాని తెలిపింది.

అయినా మీ-టూ ఉద్యమం అనేది అంతరించిపోయిందని, ప్రస్తుతం దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది ఈ బ్యూటీ.