Telugu Global
Cinema & Entertainment

రీమేక్ సినిమాలో తేజూ

కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ కూడా చేయలేదు సాయిధరమ్ తేజ్. అన్నీ స్ట్రయిట్ మూవీలే చేశాడు. ఎట్టకేలకు ఈ హీరోకు ఓ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా హిట్స్ లేక అల్లాడుతున్న ఈ టైమ్ లో ఓ సూపర్ హిట్ రీమేక్ ఇతడి చెంతకు రావడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం. ఇంతకీ తేజు దగ్గరకొచ్చిన రీమేక్ ఏంటో తెలుసా. హిందీలో హిట్ అయిన గల్లీ బాయ్ సినిమా. అవును.. రణ్వీర్ […]

రీమేక్ సినిమాలో తేజూ
X

కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రీమేక్ కూడా చేయలేదు సాయిధరమ్ తేజ్. అన్నీ స్ట్రయిట్ మూవీలే చేశాడు. ఎట్టకేలకు ఈ హీరోకు ఓ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా హిట్స్ లేక అల్లాడుతున్న ఈ టైమ్ లో ఓ సూపర్ హిట్ రీమేక్ ఇతడి చెంతకు రావడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం.

ఇంతకీ తేజు దగ్గరకొచ్చిన రీమేక్ ఏంటో తెలుసా. హిందీలో హిట్ అయిన గల్లీ బాయ్ సినిమా. అవును.. రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన వస్తుంది.

ప్రస్తుతం చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే, అర్జెంట్ గా తేజూకు ఇప్పుడో హిట్ కావాలి. అందుకే మెగా కాంపౌండ్ పెద్దమనుషులంతా కలిసి తేజూ కోసం ప్రాజెక్టులు సెట్ చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే గల్లీబాయ్ సినిమా రీమేక్ సాయిధరమ్ తేజ్ వరకు వచ్చినట్టు తెలుస్తోంది.

First Published:  19 Feb 2019 7:30 AM GMT
Next Story