Telugu Global
NEWS

మహిళలు మంత్రులుగా పనికిరారా.... కేసీఆర్?

“తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మహిళలే బలం. వారి కోసమే మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలను తీసుకు వచ్చింది తెలంగాణ మహిళల కోసమే” ఈ మాటలు అన్నది ఎవరో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది. అవును.. ఆయనే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని,  ప్రేమను, ఆప్యాయతను చూపించే కల్వకుంట్ల వారికి […]

మహిళలు మంత్రులుగా పనికిరారా.... కేసీఆర్?
X

“తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మహిళలే బలం. వారి కోసమే మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలను తీసుకు వచ్చింది తెలంగాణ మహిళల కోసమే” ఈ మాటలు అన్నది ఎవరో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది. అవును.. ఆయనే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని, ప్రేమను, ఆప్యాయతను చూపించే కల్వకుంట్ల వారికి మహిళలను మంత్రులుగా చేయడం మాత్రం సుతరామూ ఇష్టం లేనట్టుగా ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆనాటి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు.. కంటితుడుపు చర్యగా డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఒక్క మహిళ కి ఇచ్చారు. ఈ వివక్షపై అటు పార్టీలో గాని, ఇటు తెలంగాణ సమాజం నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు.

సరే.. జరిగింది ఏదో జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు అయినా తగిన ప్రాధాన్యం ఉంటుందని మహిళా శాసనసభ్యులు ఆశలు పెట్టుకున్నారు.

వారే కాదు పార్టీ సీనియర్లు కూడా మంత్రివర్గంలో ఈసారి మహిళలకు కచ్చితంగా అవకాశం ఉంటుందని భావించారు. అయితే వారు ఒకటి తలిస్తే అధినేత మరొకటి తలచినట్లు గా ఈక్యాబినెట్ విస్తరణ లో కూడా ఒక్క మహిళకూ అవకాశం వచ్చేలా లేదు.

మంత్రి పదవి ఖాయం అని టీవీ స్క్రోలింగ్ లో వస్తున్న పేర్లలో ఒక్క మహిళా శాసనసభ్యురాలు కూడా లేకపోవడం ఈసారి మహిళలకు ఇక రానట్లే అంటున్నారు. ఈ కేబినెట్ విస్తరణలో పది మందికి చోటు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి. అంటే భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇక ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ ఆరు మంత్రి పదవుల కోసం ఎన్ని వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఉంటాయో వేచి చూడాల్సిందే. ఆ పోటీలో కూడా మహిళా శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు తక్కువే ఉంటాయంటున్నారు.

First Published:  18 Feb 2019 8:26 PM GMT
Next Story