Telugu Global
Cinema & Entertainment

డ్యూయల్ రోల్ లో విజయ్ దేవరకొండ

చిన్న హీరో రేంజ్ నుంచి స్టార్ హీరో రేంజ్ కి దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకి తెలుగు లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాని క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఒకవైపు సింగరేణి గ్రూప్ కి యూనియన్ లీడర్ […]

డ్యూయల్ రోల్ లో విజయ్ దేవరకొండ
X

చిన్న హీరో రేంజ్ నుంచి స్టార్ హీరో రేంజ్ కి దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకి తెలుగు లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాని క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

అయితే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.

ఒకవైపు సింగరేణి గ్రూప్ కి యూనియన్ లీడర్ గా మరోవైపు ఒక ఎనిమిదేళ్ళ బాబుకి తండ్రిగా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట. ఒకవేళ ఇదే గాని నిజం అయితే విజయ్ దేవరకొండ నటించబోయే తోలి డ్యూయల్ రోల్ సినిమా ఇదే అవుతుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ పై రామారావు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత తమిళ్, తెలుగు బాషల్లో రూపొందబోయే ఒక సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడట విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.

First Published:  19 Feb 2019 3:18 AM GMT
Next Story