పాక్ ఖైదీని కొట్టి చంపిన భారత ఖైదీలు..!

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన ఖైదీని… భారత ఖైదీలు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది.

తోటి ఖైదీలతో పాకిస్థాన్ కు చెందిన ఖైదీ గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన భారత ఖైదీలు రాళ్లతో కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.

ఈ ఘటన సమాచారం తెలుసుకున్న సీనియర్ పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు. పాక్ ఖైదీని కొట్టిచంపిన మాట వాస్తవమేనని జైళ్ల శాఖ ఐజీ రూపిందర్ సింగ్ తెలిపారు. కాగా 2011 నుంచి ఈ పాక్ ఖైదీ గూఢచర్యం కేసులో ఈ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నట్లుగా తెలిపారు.

భారత జైళ్లలో 347మంది పాక్ ఖైదీలు శిక్షను అనుభవిస్తుంటే… పాక్ జైళ్లలో 537మంది భారత ఖైదీలు బందీలుగా ఉన్నారు.