Telugu Global
Cinema & Entertainment

క్లైమాక్స్ మార్చారు.... కానీ ప్రయోజనం లేదు

ఏదో ఊహించి సినిమా రిలీజ్ చేస్తారు. తీరా మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చేసరికి కత్తిరింపుల కార్యక్రమం షురూ చేస్తారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. రన్ టైమ్ తగ్గించినా సినిమాకు పాజిటివ్ టాక్ రాదు. కలెక్షన్లు పెరగవు. ఇవన్నీ తెలిసి కూడా లవర్స్ డే నిర్మాతలు చాలా పెద్ద సాహసం చేశారు. వాలంటైన్స్ డే కానుకగా రీసెంట్ గా విడుదలైంది లవర్స్ డే సినిమా. మలయాళం సినిమాకు డబ్బింగ్ ఇది. కన్నుగీటి ఇంటర్నెట్ లో పాపులర్ […]

క్లైమాక్స్ మార్చారు.... కానీ ప్రయోజనం లేదు
X

ఏదో ఊహించి సినిమా రిలీజ్ చేస్తారు. తీరా మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చేసరికి కత్తిరింపుల కార్యక్రమం షురూ చేస్తారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. రన్ టైమ్ తగ్గించినా సినిమాకు పాజిటివ్ టాక్ రాదు. కలెక్షన్లు పెరగవు. ఇవన్నీ తెలిసి కూడా లవర్స్ డే నిర్మాతలు చాలా పెద్ద సాహసం చేశారు.

వాలంటైన్స్ డే కానుకగా రీసెంట్ గా విడుదలైంది లవర్స్ డే సినిమా. మలయాళం సినిమాకు డబ్బింగ్ ఇది. కన్నుగీటి ఇంటర్నెట్ లో పాపులర్ అయిన ప్రియాప్రకాష్ వారియర్ నటించిన సినిమా ఇదే. ఆ కన్నుగీటే సన్నివేశం కూడా ఈ సినిమాలోనిదే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

దీంతో మేకర్స్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఏకంగా సినిమా క్లయిమాక్స్ మార్చారు. కొత్తగా ప్లాన్ చేసిన క్లయిమాక్స్ ను ఇవాళ్టి నుంచి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ మార్పు కోసం మేకర్స్ బాగానే కష్టపడ్డారు. కానీ దీనివల్లే ఏమాత్రం ప్రయోజనం ఉండదంటున్నారు సినీ విశ్లేషకులు. ఆల్రెడీ అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన ఈ సినిమాకు క్లయిమాక్స్ మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు. మేకర్స్ మాత్రం కొత్త క్లయిమాక్స్ కోసం ప్రేక్షకులు ఎగబడతారనే భ్రమలో ఉన్నారు.

First Published:  20 Feb 2019 5:30 AM GMT
Next Story