Telugu Global
Cinema & Entertainment

శేఖర్ కమ్ముల కోసం.... కాజల్ డేట్స్ సెట్ చేసిన దిల్ రాజు

శేఖర్ కమ్ముల …..ఈ పేరు వినగానే చక్కటి ఫ్యామిలీ మూవీస్ తో పాటు మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా క్రేజ్ ఉంది. ఇక శేఖర్ కమ్ముల గత చిత్రం అయిన “ఫిదా” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల అందరూ […]

శేఖర్ కమ్ముల కోసం.... కాజల్ డేట్స్ సెట్ చేసిన దిల్ రాజు
X

శేఖర్ కమ్ముల …..ఈ పేరు వినగానే చక్కటి ఫ్యామిలీ మూవీస్ తో పాటు మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా క్రేజ్ ఉంది.

ఇక శేఖర్ కమ్ముల గత చిత్రం అయిన “ఫిదా” బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు.

ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల అందరూ కొత్త వాళ్ళతో కలిసి ఏషియన్ సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఈ షూటింగ్ అయిపోగానే మళ్ళీ శేఖర్ కమ్ముల దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయనున్నాడట. అయితే ఈ సారి శేఖర్ కమ్ముల లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తాడని టాక్.

ఇక దిల్ రాజు కూడా శేఖర్ కమ్ముల కోసం కాజల్ అగర్వాల్ డేట్స్ కూడా సెట్ చేశాడట. శేఖర్ కమ్ముల ఇదివరకే నయనతార తో “అనామిక” వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కించాడు.

First Published:  20 Feb 2019 12:30 AM GMT
Next Story